Pawan Kalyan
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలు ఇటు సినిమాలను చక్కగా మ్యానేజ్ చేస్తున్నారు. వారాహి యాత్ర చేస్తూనే ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మూవీ బ్రో జులై 28న విడుదలైంది. మరో మూడు సినిమాలు మధ్యలో ఉన్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని ముందు పూర్తి చేస్తారనే సందేహాలు నెలకొన్నాయి. వీరమల్లు భారీ పాన్ ఇండియా మూవీ కావడంతో దీన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసినట్లు సమాచారం. ఈ మేరకు ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం కూడా క్లారిటీ ఇచ్చారు.
ఇక ఉస్తాద్ భగత్ సింగ్ పై పలు రూమర్స్ ఉన్నాయి. ఆ మధ్య ప్రాజెక్ట్ ఆగిపోయింది. దర్శకుడు హరీష్ శంకర్ హీరో రవితేజతో మూవీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారని కథనాలు వెలువడ్డాయి. ఇటీవల తెరపైకి వచ్చిన మరో అంశం ఏమిటంటే… ఉస్తాద్ భగత్ సింగ్ ని వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి 2024 సంక్రాంతి బరిలో దించాలని చూస్తున్నారట.
ఉస్తాద్ భగత్ సింగ్ లో పొలిటికల్ సెటైర్స్ కి బాగా స్కోప్ ఉన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు ఇలాంటి పవర్ ఫుల్ మూవీతో రావాలని భావిస్తున్నారట. అందుకే వరుస షెడ్యూల్స్ తో ఉస్తాద్ షూటింగ్ కంప్లీట్ చేయాలని దర్శకుడు హరీష్ శంకర్ కి చెప్పాడని అంటున్నారు. మరి అదే నిజమైతే ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. కాగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న గ్యాంగ్ స్టర్ డ్రామా ఓజీకి కూడా ముహూర్తం కుదిరిందట.
ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ కి విడుదల చేస్తారట. ఓజీ సైతం ఏపీ సార్వత్రిక ఎన్నికలకు ముందే ఉంటుందని అంటున్నారు. మరి అదే జరిగితే నెలల వ్యవధిలో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ చిత్రాలు థియేటర్స్ లో సందడి చేయనున్నాయి. ఈ రెండు చిత్రాలపై ఫ్యాన్స్ లో భారీ హైప్ ఉంది. రికార్డ్స్ బద్దలు కొట్టడం ఖాయం అంటున్నారు. మరి చూడాలి పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…