Pushpa 2 : తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నారు. అందులో అల్లు అర్జున్ ఒకరు. ఆయన పాన్ ఇండియాలో నెంబర్ వన్ హీరో పొజిషన్ కోసం రేసులో ఉన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి సినిమాను చేయడానికి సిద్ధమవుతున్నాడు…
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేసిన పుష్ప 2 సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండడంతో ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేస్తానని ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. ఇక వీళ్ల కాంబినేషన్ లో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో అనే మూడు సినిమాలు వచ్చాయి. మరి ఈ మూడు సినిమాలు కూడా సక్సెస్ లను సాధించడంతో అల్లు అర్జున్ క్రేజ్ తారా స్థాయిలో పెరిగిందనే చెప్పాలి. ఇక అప్పటితో పోల్చుకుంటే పుష్ప 2 సినిమా తర్వాత పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ రేంజ్ అయితే భారీగా మారిపోయింది. మరి ఇలాంటి సందర్భంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదటిసారి పాన్ ఇండియా సబ్జెక్టుని డీల్ చేసే అవకాశం అయితే దొరికింది. ఇక స్వతహాగా రైటర్ కావడంతో త్రివిక్రమ్ ఇన్ని రోజులపాటు మాటల మంత్రికుడిగా గుర్తింపు పొంది కేవలం మాటలచేతే సినిమాలను సక్సెస్ చేసిన రోజులు కూడా ఉన్నాయి.
కానీ ఇప్పుడు పాన్ ఇండియా అంటే తెలుగు డైలాగుల్లో ఉన్న పటిష్టత ఇతర భాషల్లో డబ్ చేసినప్పుడు ఉండకపోవచ్చు. కాబట్టి త్రివిక్రమ్ ఇప్పుడు మాటలను నమ్ముకోకుండా విజువల్ పరంగా సినిమా ని చూపించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకు అంటే ఒక సినిమాని విజువల్ గా బాగా చూపిస్తేనే పాన్ ఇండియా ప్రేక్షకులకు రీచ్ అవుతుంది.
ఇక పుష్ప 2 సినిమా విషయంలో అదే జరిగింది. సుకుమార్ చాలా అద్భుతమైన విజువల్స్ తో ఈ సినిమాని నడిపించాడు. అందువల్లే ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది…ఇక దానికోసమే త్రివిక్రమ్ కూడా తన శైలిని మారుస్తూ విజువల్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడట. ఇక అలాగే అల్లు అర్జున్ యొక్క హావా భావాలు ఆయన మాట్లాడే మాటలు మొత్తం పర్ఫెక్ట్ లెవల్లో ఉండే విధంగా చూసుకోవాలనే ధోరణిలో ఆలోచిస్తున్నాడు…
ఇక దానివల్లే కొంతవరకు త్రివిక్రమ్ మీద ప్రెషర్ అయితే పెరుగుతుంది. ఇక అల్లు అర్జున్ అభిమానులు సైతం పుష్ప 2 సినిమా తర్వాత వస్తున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాలను రీచ్ అవ్వాలంటే త్రివిక్రమ్ భారీగా కష్టపడాల్సిన అవసరమైతే ఉంది…