https://oktelugu.com/

Aadipurush – RRR Collections : ‘ఆదిపురుష్’ దెబ్బకి బయటపడిన #RRR మూవీ ఫేక్ కలెక్షన్స్

నైజాం జిల్లాలలో #RRR మరియు ఆదిపురుష్ చిత్రాలకు పెద్ద గ్రాస్ గ్యాప్ కూడా లేదు, కానీ #RRR చిత్రానికి మరియు ఆదిపురుష్ చిత్రానికి మధ్య 10 కోట్ల రూపాయిల షేర్ తేడా ఉన్నట్టుగా చూపించారు. షేర్ లో అంత భారీ గ్యాప్ ఉండే సమస్యే లేదని, కచ్చితంగా #RRR చిత్రం ఫేక్ చేసారని అంటున్నారు ట్రేడ్ పండితులు, దీనిపై సోషల్ మీడియా లో ప్రస్తుతం పెద్ద రచ్చే జరుగుతుంది.

Written By:
  • Shiva
  • , Updated On : June 18, 2023 / 09:35 AM IST
    Follow us on

    Aadipurush – RRR Collections: కోట్లాది మంది అభిమానులు మరియు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూసిన యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ‘ఆదిపురుష్’ చిత్రం ఇటీవలే అన్నీ ప్రాంతీయ బాషలలో ఘనంగా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతం సృష్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది.

    టాక్ ప్రభావం వల్ల రెండవ రోజు వసూళ్లు బాగా తగ్గిపోతాయని అనుకున్నారు ట్రేడ్ పండితులు. నూన్ షోస్ బాగా ఎఫెక్ట్ అయ్యాయి కానీ, మ్యాట్నీ షోస్ నుండి చిన్న పికప్ అయ్యి, ఫస్ట్ షోస్ నుండి ప్రతీ చోట హౌస్ ఫుల్స్ ని రిజిస్టర్ చేసుకుంది ఈ చిత్రం. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుండే ఈ సినిమా రెండవ రోజు 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ఇక హిందీ లో అయితే మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందట. ఇదంతా పక్కన పెడితే ‘ఆదిపురుష్’ చిత్రం వసూళ్ల కారణంగా #RRR మూవీ కి వెయ్యబడ్డ ఫేక్ కలెక్షన్స్ బయటపడ్డాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక అసలు విషయానికి వస్తే, గతం లో #RRR చిత్రానికి నైజాం ప్రాంతం లో దాదాపుగా మొదటి రోజు 23 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. #RRR మూవీ కి ఉన్న టికెట్ రేట్స్ ‘ఆదిపురుష్’ కి ఉన్నాయి, #RRR చిత్రానికి ఏ రేంజ్ వసూళ్లు అయితే వచ్చాయో, ఆదిపురుష్ చిత్రానికి కూడా అదే రేంజ్ వసూళ్లు గ్రాస్ వసూళ్లు వచ్చాయి.