Mickey 17 Trailer: ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు అయితే ఉంటుంది. వాళ్ళు ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా చాలా క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రేక్షకులను ఆ సినిమాలో ఇన్వాల్వ్ చేయడంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్లకున్న టెక్నాలజీ మీద ఆధారపడి వాళ్ళు ఇలాంటి సినిమాలను తీస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ టెక్నాలజీని వాడుకొని సక్సెస్ లను సాధించడమే కావడం విశేషం. ఇక హాలీవుడ్ లో చాలామంది మేకర్స్ వాళ్ళ ప్రతిభను చూపిస్తూ ముందుకు కదులుతున్నప్పటికీ, మరి కొంతమంది మాత్రం అండరేటెడ్ డైరెక్టర్లు గానే మిగిలిపోతుంటారు…ఇక ప్రస్తుతం ‘మిక్కీ 17’ అనే మూవీ ట్రైలర్ రిలీజ్ అవ్వడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేస్తుంది.
ఇక ఈ సినిమా దర్శకుడు అయిన ‘బాంగ్ జూన్ హు’ తెలుగు సినిమాలు చేసి సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ ట్రైలర్ లో మిక్కి బర్న్స్ పాత్ర చాలా కీలకం గా కనిపిస్తుంది… కొంతమంది కొన్ని రిస్క్ తో కూడుకున్న పనులను చేయడానికి ఒప్పుకుంటారు. ఇక అలాంటివారు చాలా సందర్భాల్లో చనిపోతే వాళ్ళ దగ్గర ఉన్న సాంకేతికతను వాడి వాళ్ళను బతికిస్తూ ఉంటారు.నిజానికి ఎడ్వర్డ్ ఆష్టన్ 2022 లో తను రాసిన నవల మిక్కి 7 లో ఈ ప్రపంచాన్ని సృష్టించాడు…
ఇక ఈ సినిమాని హై వోల్టేజ్ టెక్నాలజీని వాడుతూ చాలా అద్భుతమైన విజువల్స్ ని చూపిస్తూ సినిమాను విజువల్ వండర్ తెరకెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ట్రైలర్ ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకోవడమే కాకుండా సినిమాలోని స్టోరీ ని పరిచయం చేసింది.
మరి ఈ సినిమా మిగతా సినిమాలన్నింటి కంటే కూడా భారీ రికార్డును క్రియేట్ చేస్తుంది అని దర్శకుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఎక్కువ భాగం గ్రాఫిక్స్ తోనే ఈ సినిమా ఉండబోతుందనేది ట్రైలర్ ను చూస్తే తెలుస్తుంది… ఇక ఈ సినిమాలో 17 సార్లు చనిపోయి బతికిన మిక్కి బర్న్స్ పరిస్థితి ఎలా ఉంటుంది.
ఆయన ఎలాంటి ఎమోషన్ ను కలిగి ఉన్నాడు అనేది హైలెట్ చేస్తు ఈ సినిమా ముందుకు సాగబోతునట్టుగా తెలుస్తుంది…ఇక మిక్కి బర్న్స్ క్యారెక్టర్ ను ప్యాటిసన్ పోషించాడు. ఆయన పాత్ర ఈ సినిమాకు హైలెట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…