https://oktelugu.com/

Vijay Devarakonda: భయంలో విజయ్ దేవరకొండ.. డేట్స్ ఇవ్వాలా ? హ్యాండ్ ఇవ్వాలా ?

Vijay Devarakonda: ఈ రోజుల్లో మంచి డైరెక్టర్ అని పేరు వచ్చినా.. ఆ డైరెక్టర్ గాని తన సినిమాకు కలెక్షన్స్ ను రాబట్టలేకపోతే.. ఇక ఆ డైరెక్టర్ కమర్షియల్ గా ప్లాప్ అయినట్టే. అతనికి అతని చిత్రాలకు మార్కెట్ లో డిమాండ్ ఉండదు. అది ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే. అందుకే, ఒక ప్లాప్ జీవితాన్నే మార్చేస్తోంది అంటారు. ముఖ్యంగా సినిమా దర్శకుల జీవితాల్లో ఇది మరీ ఎక్కువ. డీసెంట్ డైరెక్టర్ గా శివ నిర్వాణకి […]

Written By:
  • Shiva
  • , Updated On : December 18, 2021 / 11:19 AM IST
    Follow us on

    Vijay Devarakonda: ఈ రోజుల్లో మంచి డైరెక్టర్ అని పేరు వచ్చినా.. ఆ డైరెక్టర్ గాని తన సినిమాకు కలెక్షన్స్ ను రాబట్టలేకపోతే.. ఇక ఆ డైరెక్టర్ కమర్షియల్ గా ప్లాప్ అయినట్టే. అతనికి అతని చిత్రాలకు మార్కెట్ లో డిమాండ్ ఉండదు. అది ఎంత గొప్ప డైరెక్టర్ అయినా సరే. అందుకే, ఒక ప్లాప్ జీవితాన్నే మార్చేస్తోంది అంటారు. ముఖ్యంగా సినిమా దర్శకుల జీవితాల్లో ఇది మరీ ఎక్కువ. డీసెంట్ డైరెక్టర్ గా శివ నిర్వాణకి మంచి పేరు ఉంది.

    Vijay Devarakonda

    అయితే, నానితో చేసిన టక్ జగదీష్ సినిమా డిజాస్టర్ అయింది. ఆ సినిమా రిలీజ్ ముందు వరకూ హీరోలు.. శివ చుట్టూ తిరిగారు. ఆ తిరిగిన వాళ్ళల్లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. పైగా విజయ్ దేవరకొండతో తన తర్వాత చిత్రాన్ని దర్శకుడు శివ నిర్వాణతోనే చేస్తున్నాను అంటూ ప్లాన్ చేశాడు, ఒక పోస్టర్ కూడా వదిలాడు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ లాంటి సినిమాలు హిట్ తర్వాత, శివ నిర్వాణ పై అందరికీ నమ్మకం పెరిగింది.

    కానీ, ‘టక్ జగదీష్’తో ప్లాప్ అయ్యాడు శివ నిర్వాణ. నిజానికి ఓటీటీ రిలీజ్ లో హిట్, ప్లాప్ లు ఉండవు. అలాంటి ఓటీటీలో కూడా ప్లాప్ టాక్ ను తెచ్చుకున్నాడు అంటే.. ‘టక్ జగదీష్’ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే, ఇప్పుడు విజయ్ దేవరకొండ ఆలోచనలో పడ్డాడు. డేట్లు ఇవ్వాలా ? వద్దా ? తన కెరీర్ కూడా రిస్క్ లో ఉంది.

    ఇలాంటి పరిస్థితుల్లో మాట కోసం ముందుకు వెళ్తే.. కెరీరే ఉండదేమో అనే భయంలో ఉన్నాడు విజయ్. విజయ్ సినిమా కోసం శివ నిర్వాణ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా దాదాపు పూర్తి అయింది. వచ్చే నెల నుంచి షూట్ కి వెళ్లాలని శివ ప్లాన్ లో ఉన్నాడు. కానీ విజయ్ దేవరకొండ చూస్తే.. సినిమా చేయాలా ? వద్దా ? అనే ఆలోచన దగ్గరే ఆగిపోయాడు.

    Also Read: Akhanda Collections: అఖండ 15 రోజుల కలెక్షన్స్.. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి ఇలా..

    మరి, చివరికి విజయ్ దేవరకొండ.. శివ నిర్వాణకి డేట్స్ ఇస్తాడా ? లేక హ్యాండ్ ఇస్తాడా ? అనేది చూడాలి. అయితే, ఎదగాలనుకున్న ప్రతిసారీ పరిస్థితులు అదఃపాతాళానికి పడిస్తాయని.. ఎత్తు పల్లాలను ఎదుర్కొని ముందుకు వెళ్తేనే అద్భుతాలు చేయగలమని చెబుతున్నాడు శివ నిర్వాణ. మరి చూడాలి ఏమవుతుందో !!

    Also Read: Three Heroes: ఆ ముగ్గురు స్టార్స్ కి గ్రేట్ కమ్ బ్యాక్ ఇచ్చిన 2021

    Tags