https://oktelugu.com/

Rajamouli: అసలు పాన్​ ఇండియా సినిమా అంటే అర్థమేంటో తెలుసా-రాజమౌళి

Rajamouli: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 18, 2021 / 11:17 AM IST
    Follow us on

    Rajamouli: బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్‌ కపూర్, అలియా భట్ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘బ్రహ్మస్త్ర’. ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను మూడు పార్టులుగా ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై బాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున, డింపుల్‌ కపాడియా నటిస్తుండడంతో ఈ మూవీ టాలీవుడ్ ప్రేక్షకుల దృష్టిని కూడా ఆకర్షించింది.

    Rajamouli

    Also Read: అక్కడ సరైన ప్రమోషన్స్​ లేకున్నా.. పుష్పరాజ్ అస్సలు​ తగ్గలేదుగా?

    తాజాగా, తెలుగులో ప్రమోషన్స్ నిమిత్తం చిత్రబృందం ప్రెస్​మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమౌళిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. పాన్​ ఇండియా సినిమాలపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాన్​ ఇండియా చిత్రాల గురించి చెప్పాలంటే.. అసలు దాన్ని ఎలా నిర్ణయిస్తామో తెలియాలి. అంటూ వివరించారు. వీఎఫ్​ఎక్స్ ఎక్కువగా ఉంటేనో, బడ్జెట్​ భారీగా ఉంటేనో ఓ సినిమా పాన్​ ఇండియా సినిమా ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు.

    బాహుబలి తీసినా కూడా నా సినిమాల పరంగా నేను చెప్పగలను ఏ సినిమా పాన్​ ఇండియా అవుతుందని అంటూ చెప్పుకొచ్చారు. భాషతో సంబందం లేకుందా సినిమా అర్థం అవుతే.. అదే పాన్​ ఇండియా అంటూ రాజమౌళి చిన్న మాటతో అందర్నీ కట్టిపడేశారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్స్ పనుల్లోనూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ముంబయి చేరుకున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందురో రామ్​చరణ్​, తారక్​ హీరోలుగా నటించారు.

    Also Read: బాలయ్య అన్​స్టాపబుల్​ షోకు గెస్ట్​గా మాస్​ మహారాజ్​?