https://oktelugu.com/

Vijay Devarakonda and Shiva Nirvana : డేట్స్ ఇస్తాడా ? లేక పూరికే పరిమితం అవుతాడా ?

తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ముద్ర పడిపోయిన విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) .. గత రెండేళ్ల నుంచి ఒకే సినిమాతో గజిబిజి అయిపోతున్నాడు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’ సినిమాకి విజయ్ ఏడాది టైమ్ పెట్టుకున్నాడు. కానీ, రెండేళ్లు పూర్తి అయినా ఆ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. అసలు సినిమా ముందుకు కదలడం లేదు. లైగర్ సినిమాని త్వరగా పూర్తి చేయడానికి విజయ్ దేవరకొండ ఎన్ని […]

Written By:
  • admin
  • , Updated On : September 7, 2021 / 04:14 PM IST
    Follow us on


    తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ముద్ర పడిపోయిన విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda) .. గత రెండేళ్ల నుంచి ఒకే సినిమాతో గజిబిజి అయిపోతున్నాడు. డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీస్తున్న ‘లైగర్’ సినిమాకి విజయ్ ఏడాది టైమ్ పెట్టుకున్నాడు. కానీ, రెండేళ్లు పూర్తి అయినా ఆ సినిమా మాత్రం పూర్తి కావడం లేదు. అసలు సినిమా ముందుకు కదలడం లేదు.

    లైగర్ సినిమాని త్వరగా పూర్తి చేయడానికి విజయ్ దేవరకొండ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా..పూరి మాత్రం షూట్ ను పోస్ట్ ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మరోపక్క విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్న నిర్మాతలు, దర్శకులు ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఇప్పటికే విజయ్ దేవరకొండకు కోట్ల రూపాయిలు అడ్వాన్స్ లు ఇచ్చి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

    అయితే, విజయ్ దేవరకొండతోనే తన తర్వాత చిత్రాన్ని ప్లాన్ చేశాడు దర్శకుడు శివ నిర్వాణ. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాలు హిట్ తర్వాత శివ నిర్వాణ నుంచి వస్తోన్న సినిమా ‘టక్ జగదీష్’. ఈ సినిమా ఈ శుక్రవారం అమెజాన్ లో రిలీజ్ అవుతుంది. ఓటీటీ రిలీజ్ కాబట్టి హిట్ ప్లాప్ తో సంబంధం లేదు.

    ఇక ఈ సినిమా రిలీజ్ తో శివ నిర్వాణ ఫ్రీ అయిపోతాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. వచ్చే వారంతో ఇక పూర్తిగా ఫ్రీ అయిపోతాడు కాబట్టి, విజయ్ కి కథ చెప్పి… వచ్చే నెల నుంచి షూట్ కి వెళ్లాలని శివ ప్లాన్ లో ఉన్నాడు. మరి విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ కోసమైనా డేట్స్ ఇస్తాడా ? లేక పూరికే పరిమితం అవుతాడా ? అనేది చూడాలి.