https://oktelugu.com/

Tollywood: ఈ ముగ్గురు స్టార్ హీరోలు 2024 ను సక్సెస్ ఫుల్ గా మారుస్తారా..?

ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నే అనేంతలా మన ఇండస్ట్రీ చాలా మంచి పేరునైతే సంపాదించుకుంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం మన స్టార్ హీరోలు కూడా భారీ సక్సెస్ లను సాధిస్తూ మన ఇండస్ట్రీ పరువు నిలబెడుతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 9, 2024 / 10:52 AM IST

    Tollywood(4)

    Follow us on

    Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా గుర్తింపు పొందుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీళ్ళు ముగ్గురు సినిమాలను రిలీజ్ చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక వీళ్ళ సినిమాలు దాదాపు 3000 కోట్ల వరకు బిజినెస్ జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే 2024 లో ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ ఒకెత్తు అయితే ఈ మూడు నెలల్లో రాబోయే సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక మొదట సెప్టెంబర్ 27వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ అందుకుంటారని జూనియర్ ఎన్టీఆర్ భారీ కాన్ఫిడెంట్ తో అయితే ఉన్నాడు. మరి తను అనుకున్నట్టుగానే పాన్ ఇండియాలో భారీ సక్సెస్ సాధించి 1000 కోట్లకు పైన కలెక్షన్లు రాబడుతాడా లేడా అనేది తెలియాల్సి ఉంది…

    రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ సినిమాతో తనదైన రీతిలో సినిమా చేసి భారీ సక్సెస్ ని అందుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించి తెలుగు సినిమా ఖ్యాతిని కూడా పెంచాలనే ప్రయత్నంలో రామ్ చరణ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో కూడా రామ్ చరణ్ 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు…

    సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేస్తున్న ‘పుష్ప 2’ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. పుష్ప మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవడంతో రెండో పార్ట్ మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి దానికి తగ్గట్టుగానే సినిమా సూపర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ను ఈజీగా వసూలు చేస్తుంది. అనే నమ్మకం అయితే అందరిలో ఉంది…

    ఇక ఈ ముగ్గురు స్టార్ హీరోలే 2024వ సంవత్సరాన్ని సక్సెస్ ఫుల్ గా ముగిస్తారా లేదంటే ఒక చేదు అనుభవంల మారుస్తారా అనేది వీళ్ళ చేతుల్లోనే ఉంది. వీళ్ళ ముగ్గురు కనక సూపర్ సక్సెస్ లను అందుకుంటే తెలుగు సినిమా ఖ్యాతి పెరగడమే కాకుండా 2024వ సంవత్సరానికి కూడా చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది…