https://oktelugu.com/

NTR-Prashanth Neel Movie : ఎన్టీయార్, ప్రశాంత్ నీల్ సినిమాలో ఇంటర్వెల్ ఫైట్ అంత మంది తో ఉండబోతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికి వారసత్వంగా వచ్చిన హీరోలకి ఉన్న గుర్తింపు మిగిలిన వారికి లేదని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోశక్తి లేదు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన హీరోలు ఎంత కష్టపడినా కూడా స్టార్ హీరో రేంజ్ ను టచ్ చేయలేకపోతున్నారు. కానీ వారసత్వంగా వచ్చిన హీరోలు మాత్రం కొంతవరకు రాణించిన కూడా వాళ్ళ సినిమాలను భారీ విజయాలుగా మారుస్తూ స్టార్ హీరో స్టేటస్ ని అందుకునే విధంగా ప్రయత్నాలైతే చేస్తున్నారు...

Written By: , Updated On : February 25, 2025 / 08:30 PM IST
NTR-Prashanth Neel Movie

NTR-Prashanth Neel Movie

Follow us on

NTR-Prashanth Neel Movie  : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సందర్భంలోనే జూనియర్ ఎన్టీఆర్ (NTR) లాంటి నటుడు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తన తోటి హీరోలు కలెక్షన్లను కొల్లగొడుతూ ముందుకు దూసుకెళ్తుంటే ఈయన మాత్రం దేవర సినిమాతో కేవలం 500 కోట్ల మార్కును మాత్రమే టచ్ చేశాడు. మరి ఇలాంటి సందర్భంలో భారీ విజయాలను సాధించి తన తోటి హీరోలకు పోటీ ఇవ్వాలని చూస్తున్నాడు. బాలీవుడ్ ఇండస్ట్రీ లో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ (WAR 2) సినిమా రీసెంట్ గానే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుంది. ఇక దాంతో మార్చి నుంచి ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమా షూటింగ్ లో పాల్గొనడానికి ఎన్టీయార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా మీదనే జూనియర్ ఎన్టీఆర్ భారీ ఆశాలైతే పెట్టుకున్నాడు. ఈ సినిమా భారీ యాక్షన్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. తద్వారా ఆయన చేయబోయే సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవ్వబోతున్నాయనేది కూడా తెలియాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అద్భుతంగా ఉండబోతుందట. ప్రశాంత్ నీల్ మాస్ ఎలివేషన్స్ తో ఈ సీన్స్ ను నింపెయబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక సలార్ (Salaar) ఇంటర్వెల్ సీన్ ను కనక చూసినట్టయితే అందులో ప్రభాస్ అచ్చం డైనోసార్ లానే కనిపిస్తాడు.మరి ఇలాంటి యాక్షన్ ఎపిసోడ్స్ ని తెరకెక్కించగలిగే ప్రశాంత్ నీల్ 2000 మందితో ఒక యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి వీళ్లందరితో ఒక యాక్షన్ ఎపిసోడ్ అయితే ఉంటుందట.

అది ఆల్మోస్ట్ మనం ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చూడని విధంగా భారీ ఎమోషన్స్ తో చాలా క్రూరంగా ఉండబోతుందట…ఈ సినిమాకి ఆ ఫైట్ హైలెట్ గా నిలవబోతోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఈ ఫైట్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

మరి వచ్చే నెల నుంచి జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నాడు కాబట్టి రామోజీ ఫిలిం సిటీ లో ఈ ఫైట్ ని తెరకెక్కించి ఆ తర్వాత మిగిలిన షూట్ ని కంటిన్యూ చేయాలని తను భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక 2026 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నమైతే చేస్తున్నాడు…