https://oktelugu.com/

Telangana : తెలంగాణ మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. ఉచిత శిక్షణ! ఉపాధి అవకాశం

తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు ఉపాధి కల్పించేందుకు రేంత్‌రెడ్డి ప్రభత్వం మొదటి నుంచి చొరవ చూపుతోంది. ఈ క్రమంలోనే మహిళా శక్తి క్యాంటీన్లు, మహిళా సంఘాలకు యూనిఫాం స్ట్రిచింగ్‌తోపాటు మీసేవ కేంద్రాలు కేటాయిస్తోంది. తాజాగా మరో నిర్ణయం తీసుకుంది.

Written By: , Updated On : February 25, 2025 / 08:42 PM IST
Telangana Govt

Telangana Govt

Follow us on

Telangana  : తెలంగాణ మహిళల కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెట్టాలని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది.మార్చి 8వ తేదీన అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్రంలో మహిళల ఘనత చాటేలా మూడు రోజులు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మంత్రి సీతక్క నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీల సభ్యులుగా ఐఏఎస్ అధికారులు అనిత రామచంద్రన్, శైలజ రామయ్యర్, దివ్య దేవరాజన్ ఉన్నారు. మహిళలు సాధికారత సాధించే దిశగా ఈ కమిటీ నేతృతవంలో మహిళా దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లా కేంద్రాల్లో మహిళలకు పెట్రోల్‌ బంకులు, గ్యాస్‌ ఏజెన్సీలు ఇప్పించేందుకు వీలుగా ఆయిల్‌ కంపెనీలతో ప్రభుత‍్వం చర్చిస్తోంది.

ఉచిత శిక్షణ..
ఇక మహిళా నిరుద్యోగులు స్వయం ఉపాధి పొందేలా.. ఈవీ ఆటో, టూ వీలర్‌ డ్రైవింగ్‌లో శిక్షణ ఇస్తోంది. ఉమెన్‌ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఈ శిక్షణ ఇస్తారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలకు ఈ శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలం 45 నుంచి 60 రోజులు ఉంటుంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారికి సబ్సిడీపై ఈవీ ఆటోల అందిస్తారు. ఇప్పటికే 45 మంది శిక్షణ పొందారు. కొత్త బ్యాచ్‌ మార్చి 5న ప్రారంభం అవుతుంది.

మహిళా దినోత్సవ కానుకలు..
ఇక మహిళా దినోత్సవ కానుకలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోంది. ఉదో‍్యగ విరమణ పొందిన అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని నిర్ణయించింది. అంగన్‌వాడీ సిబ్బందికి మహిళా సంఘాల సభ్యులకు చీరలు ఇవ్వాలని, స్వయం సహాయక బృందాలకు వడ్డీ రాయితీ చెక్కులు ఇవ్వాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల స్టాల్స్‌ కూడా ఏర్పాటు చేసే ఆలోచన చేస్తున్నారు. మొత్తంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కానుకలు ఇవ్వాలని రేవంత్‌రెడ్డి సర్కార్‌ నిర‍్ణయించింది.