https://oktelugu.com/

Ghaati Glimpse: ఏం నరుకుడు రా బాబు..తలే తీసేసింది..అనుష్క ని ఇంత క్రూరంగా ఎప్పుడూ చూసి ఉండరు!

గ్లిమ్స్ వీడియో లో షాట్స్ అన్ని టాప్ క్లాస్ లో ఉన్నాయి. ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో అనుష్క చేతిలో కత్తి పట్టుకొని బస్సు లోకి ఎక్కడం, ఆ తర్వాత విలన్ తల ని తన వీపుకి ఆనించుకుని అతని పీక కోసి చేతిలో పట్టుకొని వెళ్లడం, చివర్లో రక్తం నిండిన మొహం తో సిగార్ కాల్చడం వంటివి చూపించాడు డైరెక్టర్ క్రిష్.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 05:48 PM IST

    Ghaati Glimpse

    Follow us on

    Ghaati Glimpse: లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఘాటి’. నేడు అనుష్క పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ నేడు ఉదయం విడుదల చేయగా, కాసేపటి క్రితమే ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల చేసారు. ఈ గ్లిమ్స్ వీడియో కి సోషల్ మీడియా లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అనుష్క ని ఏ డైరెక్టర్ చూపించని కోణంలో ఇందులో క్రిష్ చూపించాడు. క్యూట్ గా కనిపించే అనుష్క లో ఇంత క్రూరమైన యాంగిల్ కూడా ఉందా అని అభిమానులు సైతం ఆశ్చర్యపోయారు. ఇందులో అనుష్క అన్యాయానికి గురైన అమ్మాయిగా, పరిస్థితుల కారణంగా ఆమె హంతకురాలిగా, ఆ తర్వాత పేదలకు మంచి చేసే లెజెండ్ పాత్రలో కనిపించనుంది.

    గ్లిమ్స్ వీడియో లో షాట్స్ అన్ని టాప్ క్లాస్ లో ఉన్నాయి. ముఖ్యంగా గ్లిమ్స్ చివర్లో అనుష్క చేతిలో కత్తి పట్టుకొని బస్సు లోకి ఎక్కడం, ఆ తర్వాత విలన్ తల ని తన వీపుకి ఆనించుకుని అతని పీక కోసి చేతిలో పట్టుకొని వెళ్లడం, చివర్లో రక్తం నిండిన మొహం తో సిగార్ కాల్చడం వంటివి చూపించాడు డైరెక్టర్ క్రిష్. ఇంత వయొలెంట్ గా ఇటీవల కాలం లో హీరోలను కూడా డైరెక్టర్స్ చూపించలేకపోయారు. నరకడం లో కొత్త రకమైన పద్దతులను ఇది వరకు డైరెక్టర్స్ పరిచయం చేస్తూ వచ్చారు. ఇప్పుడు క్రిష్ ఈ యాంగిల్ లో నరకడం లో కొత్త టెక్నిక్ ని చూపించాడు. ఇంతకీ ఇందులో అనుష్క మంచిదా, లేకపోతే విలనా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. గ్లిమ్స్ లోనే ఇంతటి వయొలెన్స్ చూపిస్తే ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అనుష్క కెరీర్ లో మరో ల్యాండ్ మార్క్ సినిమాగా ఈ చిత్రం నిలబోతుందని ఈ గ్లిమ్స్ ని చూస్తేనే అర్థం అవుతుంది.

    పవన్ కళ్యాణ్ తో ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ చేస్తున్న డైరెక్టర్ క్రిష్, 70 శాతం కి పైగా షూటింగ్ ని పూర్తి చేసి, ఆ సినిమా నుండి తప్పుకున్నాడు. కారణం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, సరిగా ఆయన డేట్స్ ఇవ్వకపోవడం, క్రిష్ సమయం వృధా అవ్వడం. ‘హరి హర వీరమల్లు’ నుండి బయటకి వచ్చేసిన ఆయన, అనుష్క తో ఎదో సినిమా చేస్తున్నాడని అందరూ అనుకున్నారు కానీ, ఇలాంటి సినిమా చేస్తాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. ఈ గ్లిమ్స్ వీడియో చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కూడా ఉత్సాహం వచ్చింది. క్రిష్ లో ఇంత టాలెంట్ ఉందా, కచ్చితంగా ‘హరి హర వీరమల్లు’ ని కూడా ఇలాగే తీసి ఉంటాడని ఆనందిస్తూ పోస్టులు వేస్తున్నారు.