OG Trailer: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కి మరొక ఐదు రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రాబోతోంది. అయితే ఈ ట్రైలర్ ఒక స్టార్ హీరో వాయిస్ ఓవర్ తో చెప్పించినట్టుగా తెలుస్తోంది.
Also Read: 22 రోజుల్లో 260 కోట్లు..కానీ తెలుగు లో ‘కొత్త లోక’ కి వచ్చిన వసూళ్లు ఇంతేనా?
ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ట్రైలర్లో ప్రభాస్ వాయిస్ మనకి వినిపించబోతుందట. ఇక సుజిత్ కి ప్రభాస్ కి మధ్య చాలా మంచి సన్నిహిత సంబంధాలైతే ఉన్నాయి. అతనితో సాహో సినిమా చేసి ప్రభాస్ కి ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసి పెట్టిన సుజిత్ అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం… ఇక పవన్ కళ్యాణ్ మీద ప్రభాస్ కి మొదటి నుంచి కూడా చాలా గౌరవం ఉందని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
దాంతో సుజిత్, పవన్ కళ్యాణ్ ఇద్దరు అడగడంతో ప్రభాస్ ఈ సినిమాకి వాయిస్ ఓవర్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక ట్రైలర్లో తన వాయిస్ ఓవర్ ని ఎలివేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ యొక్క క్యారెక్టరైజేషన్ ను పరిచయం చేస్తారట. ఆయను వాయిస్ ఓవర్ నుంచి ఒక పవర్ డైలాగ్ కూడా రాబోతుందట…గతంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘జల్సా’ సినిమాలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి మ్యాజిక్ ఏ చేయబోతున్నారు. మరి ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా కట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఒక్క టీజర్ తో సినిమా మీద భారీ హైప్స్ పెంచాలనే ప్రయత్నంలో సుజిత్ అయితే ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ ట్రైలర్ ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తోంది. తద్వారా సినిమా మీద మరింత హైప్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…