Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై నెగటివ్ టాక్ ని సొంతం చేసుకోవడం మనమంతా చూసాము. #RRR వంటి సంచలనాత్మక చిత్రం తర్వాత రామ్ చరణ్ ఈ సినిమా కోసం సుమారుగా మూడేళ్ళ సమయాన్ని కేటాయించాడు. ఈ మూడేళ్ళలో ఆయన మరో సినిమాకి కూడా డేట్స్ ఇవ్వలేదు. మధ్యలో శంకర్ ఇండియన్ 2 పూర్తి చేసుకొచ్చాడు. అయినప్పటికీ కూడా రామ్ చరణ్ ఇసుమంత అసహనం కూడా చూపకుండా డైరెక్టర్ కి పూర్తి స్థాయిలో సహకరించాడు. నిర్మాత దిల్ రాజు కూడా డైరెక్టర్ శంకర్ కోరినంత బడ్జెట్ ని కేటాయించాడు. చాలా రిచ్ గా, లావిష్ గా ఈ చిత్రాన్ని క్వాలిటీ తో నిర్మించడం లో ఆయన సక్సెస్ అయ్యాడు. హీరో రామ్ చరణ్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ వంటి వారు కూడా తమ వైపు నుండి బెస్ట్ ఇచ్చారు.
కానీ ఫెయిల్ అయ్యింది కేవలం శంకర్ ఒక్కటే. అయినప్పటికీ కూడా రామ్ చరణ్ మంచి ఫామ్ లో ఉన్నటువంటి సూపర్ స్టార్ అవ్వడం తో ఈ చిత్రానికి ఎంత నెగటివ్ టాక్ వచిన్నప్పటికీ మినిమం గ్యారంటీ వసూళ్లను రాబట్టాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో ఒకసారి చూస్తే, నైజాం లో పది కోట్లు, సీడెడ్ లో 5.86 కోట్లు,ఉత్తరాంధ్ర లో 5.40 కోట్లు, నెల్లూరు జిల్లాలో 2 కోట్ల 10 లక్షల రూపాయిలు, గుంటూరు జిల్లాలో 4 కోట్ల 75 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి 4 కోట్ల 15 లక్షల రూపాయిలు, వెస్ట్ గోదావరి 2 కోట్ల రూపాయిలు , కృష్ణ జిల్లాలో 2 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 35 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ పండితులు.
గ్రాస్ దాదాపుగా 70 కోట్ల రూపాయిల వరకు ఉంటుంది. అదే విధంగా ఓవర్సీస్ లో 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, హిందీ లో 10 కోట్ల రూపాయిల గ్రాస్, తమిళం లో నాలుగు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కర్ణాటక లో 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసిన ఈ చిత్రం, ఓవరాల్ ప్రపంచవ్యాప్తంగా 105 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ ని సొంతం చేసుకుంది. కానీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రానికి 186 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేసారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద వివాదానికి దారి తీసింది. ఇతర హీరోల అభిమానులు ఇదంతా ఫేక్ కలెక్షన్స్ అంటూ పెద్ద రచ్చ చేస్తున్నారు.