https://oktelugu.com/

Thalavan Movie : సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు బెంచ్ మార్క్ గా మారిన మలయాళం సినిమా… ఓటిటి ని సైతం షేక్ చేస్తుందా..?

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేక్షకుడి అభిరుచి కూడా మారుతూ వస్తుంది. రొటీన్ సినిమాలకు స్వస్తి పలుకుతూ ప్రేక్షకుడు కొత్త పంథా లో అతన్ని ఎంటర్ టైన్ చేయడానికి సినిమాలు సరికొత్త కథలతో వస్తేనే తప్ప లేకపోతే మాత్రం ఆ సినిమాని చూడలేకపోతున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 25, 2024 / 09:29 AM IST

    Thalavan movie

    Follow us on

    Thalavan Movie : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మంచి కథలతో సినిమాలు రావాలంటే అది మలయాళ ఇండస్ట్రీకి మాత్రమే సాధ్యమవుతుంది అంటూ చాలా రోజుల నుంచి చాలా వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి మలయాళం ఇండస్ట్రీ చిన్న కాన్సెప్ట్ లతో మంచి సినిమాలను చేస్తూ అందర్నీ ఎంటర్ టైన్ చేస్తూ ఉంటాయి. అందువల్లే ఆ ఇండస్ట్రీకి ఎక్కడ లేని క్రేజ్ అయితే దక్కుతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే నటుడు బిజు మినన్, ఆసిఫ్ అలీ ముఖ్య పాత్రల్లో నటించిన ‘తలావన్’ సినిమా కూడా ప్రేక్షకులందరిని మెప్పిస్తుందనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఒక ట్రెండ్ సృష్టించడమే కాకుండా ఒక పెను ప్రభంజనాన్ని కూడా సృష్టిస్తుంది. సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకి ఒక కొత్త అర్ధాన్ని ఇస్తుంది. అలాగే ఓటిటి ప్లాట్ ఫామ్ మొత్తాన్ని షేక్ చేస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. అత్యధిక వ్యూయర్షిప్ ను సంపాదించుకుంటూ సస్పెస్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక మాస్టర్ పీస్ గా మారుతుంది. మొత్తానికైతే ఈ సినిమాతో బిజూ మీనన్ ఒక మంచి సక్సెస్ అందుకున్నాడు.

    ఇక ఇలాంటి క్యారెక్టర్లను పోషించడంలో బిజూ మీనన్ ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. నిజానికి ఈ సినిమా ప్లాట్ పాయింట్ విషయానికి వస్తే ఒకే పోలీస్ స్టేషన్లో ఉండే ఇద్దరు పోలీస్ ఆఫీసర్ల మధ్య జరిగే ఒక చిన్న ఇష్యూ మీద ఈ సినిమా స్టార్ట్ అయి ఆ తర్వాత ఒక మర్డర్ మిస్టరీ మీదికి మళ్లీంపబడుతుంది.

    అయితే ఇంతకీ ఆ మర్డర్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే పాయింట్ మీద డైరెక్టర్ ‘జీస్ జాయ్ ‘ రాసుకున్న స్క్రీన్ ప్లే ప్రేక్షకులందరినీ ఎక్సైట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ సినిమా తీయడంలో జీస్ జాయ్ చాలా వరకు సక్సెస్ ని సాధించాడు. ఇక ఈ సినిమాలో వచ్చే ట్విస్టులు అయితే ప్రేక్షకులందరిని ఎంటర్ టైన్ చేయడమే కాకుండా వాళ్ళ అందరి చేత విజిల్స్ కూడా వేయిస్తున్నాయి.

    ఇక మొత్తానికైతే ఒటిటి ప్లాట్ ఫామ్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఒక మలయాళం సినిమా మంచి పేరు ప్రఖ్యాతలను సాధించడం అనేది ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీలోనే ఒక హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికైతే ఇక మీదట కూడా ఇలాంటి మంచి కాన్సెప్టు లతో సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తే చూడాలని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు… తెలుగులో కూడా ఇలాంటి మంచి కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తే ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు…