Tollywood IMDB Rating : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ వాళ్ళు మాస్ కమర్షియల్ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తమకంటూ ఒక పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు. అయిన కూడా కొన్ని అరుదైన రికార్డులు కొంతమంది మేకర్స్ కే దక్కుతూ ఉంటాయి. నిజానికి ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలో చాలా వరకు జరుగుతూనే ఉంటాయి. మరి అలాంటి సందర్భంలో స్టార్ హీరోలు సైతం బ్రేక్ చేయలేని కొన్ని రికార్డులను ఈ చిన్న హీరోలు చిన్న దర్శకులు బ్రేక్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అయింది అంటే ఆ సినిమా సక్సెస్ వెనక కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం దర్శకుడుని ఎక్కువగా నిందిస్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని క్రాఫ్ట్ ల మీద ఎక్కువ కమాండ్ ఉండేది అతని ఒక్కడికే కాబట్టి ఆ దర్శకుడు ఆ సినిమాను సక్సెస్ ఫుల్ గా డీల్ చేయలేకపోయాడు అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐఎండిబి రేటింగ్ ప్రకారం అత్యధిక రేటింగ్ ను సంపాదించుకున్న టాప్ 3 సినిమాలు ఏవి అనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
మాయ బజార్
సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి దిగ్గజ నటులు నటించిన మాయాబజార్ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించింది. 1957 వ సంవత్సరంలో రిలీజ్ అయిన ఈ సినిమా కె.వి.రెడ్డి దర్శకత్వంలో రావడమే కాకుండా ఆయన ఇమేజినేషన్ కి ఒక దృశ్య రూపాన్ని ఇచ్చారనే చెప్పాలి. నిజానికి ఆ సినిమా ఇచ్చిన హై మూమెంట్ అంతా కాదు అభిమన్యుడు, శశిరేఖ పెళ్లిని శ్రీకృష్ణుడు ఎలా జరిపించాడనే ఒక పాయింట్ ను తీసుకుని ఆయన వీక్షకులకు చూపించిన విధానం అత్యద్భుతం అనే చెప్పాలి. ఇక ఈ సినిమా ఐఎండిబి రేటింగ్ ప్రకారం 9.2 రేటింగ్ ని దక్కించుకొని టాప్ పొజిషన్ లో కొనసాగుతుంది…
అహన పెళ్ళంట
రాజేంద్రప్రసాద్ హీరోగా జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన కామెడీ ఎంటర్ టైనర్ ఆహనా పెళ్ళంట ఈ సినిమా అప్పట్లో ఒక పెను సంచలనాన్ని సృష్టించింది. ఇక ఇప్పటికి ఈ సినిమాకి చాలామంది అభిమానులు ఉన్నారు. ఇక ఈ సినిమాలోని కామెడీ ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి IMDB ఇచ్చిన రేటింగ్ 9
కేరాఫ్ కంచరపాలెం
ఎలాంటి స్టార్ యాక్టర్లు లేకుండా కొత్త దర్శకుడు అయిన వెంకటేష్ మహా చిత్రీకరించిన ఈ సినిమా ప్రేక్షకులందరికి అమితంగా నచ్చాడమే కాకుండా ఈ సినిమా ఒక సూపర్ సక్సెస్ గా నిలిచిందనే చెప్పాలి. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా ఐఎండిబి ప్రకారం 8.9 రేటింగ్ ని సంపాదించుకుంది…