Bigg Boss Telugu 8 : ఈ సీజన్ లో రెండవ వారం లో ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా ని చూసి ఆడియన్స్ చాలా బాధపడిన సంగతి అందరికీ తెలిసిందే. హౌస్ లో చాలా రోజులు ఉండేందుకు అర్హత ఉన్న కంటెస్టెంట్, మంచి స్టఫ్ ఉన్న కంటెస్టెంట్ ని బయటకి పంపేశారు అనే భావన ప్రతీ ఒక్కరిలో ఉంది. శేఖర్ బాషా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అవ్వలేదు. కంటెస్టెంట్స్ ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ అయ్యాడు. ఆయన రీ ఎంట్రీ కూడా ఉండొచ్చు అని కొంతమంది అంటున్నారు. హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత శేఖర్ బాషా అనేక ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూస్ లో ఆయన రీ ఎంట్రీ కి అవకాశం ఉంటే కచ్చితంగా మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తాను,ఈసారి కంటెస్టెంట్స్ కి చుక్కలు చూపిస్తాను అని చెప్పుకొచ్చాడు.
అంతే కాదు హౌస్ లో కంటెస్టెంట్స్ గురించి నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్టు చెప్పేసాడు శేఖర్ బాషా. ముఖ్యంగా సోనియా ఫేక్ గేమ్ గురించి కుండబద్దలు కొట్టినట్టు ఆడియన్స్ కి అనేక సందర్భాలలో వివరించాడు. సోషల్ మీడియా లో ఆమెపై ఏ స్థాయి నెగటివిటీ ఉందో అందరికీ తెలిసిందే. అందరికి ఆమె పై ఎలాంటి అభిప్రాయం ఉందో, హౌస్ లో దగ్గర నుండి ఆమె ఆట తీరుని చూసిన శేఖర్ బాషా అభిప్రాయం కూడా అలాగే ఉంది. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో ఆయనను ఒక యాంకర్ ప్రశ్న అడుగుతూ ‘హౌస్ లో మీకు కన్నింగ్ గా ఆడుతున్న కంటెస్టెంట్ ఎవరని అనిపించింది’ అని అడగగా, దానికి శేఖర్ బాషా సమాధానం చెప్తూ ‘సోనియా ఆట చాలా కన్నింగ్ గా అనిపించింది. హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు సోనియా ని చూడగానే చాలా సాఫ్ట్ ఉంది, మంచిగా మాట్లాడుతుంది, మంచి అమ్మాయి అని అనుకున్నాను, కానీ ఆరంజ్ విషయం లో ఆమె ప్రవర్తించిన తీరుని చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడే నాకు ఆమె మీద అభిప్రాయం మారిపోయింది. ఇక నామినేషన్స్ లో ఆమె ప్రవర్తన చూసి షాక్ తిన్నాను. అప్పటి వరకు నేను చూసిన సోనియా వేరు, ఆరోజు నేను చూసిన సోనియా వేరు. ఇష్టమొచ్చినట్టు నోరు జారడం చూసి నాకు మతిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడిన మాటలను ఏకీభవిస్తూ కామెంట్స్ లో నెటిజెన్స్ సమర్దించారు. అలాగే వచ్చే వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుంటున్నారు అని శేఖర్ బాషా ని అడగగా, ఆయన దానికి సమాధానం చెప్తూ ‘ఆదిత్య ఓం అని అనిపిస్తుంది. ఆయన అక్కడి వాతావరణం ని తట్టుకోలేకపోతున్నాడు, నేను గమనించాను. అలాగే గేమ్ కూడా మిగిలిన కంటెస్టెంట్స్ తో పోలిస్తే తక్కువే కానీ, తన బెస్ట్ తాను ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కంటెస్టెంట్స్ కి చివరగా ఎంటర్టైన్మెంట్ ని అందించే కంటెస్టెంట్స్ మాత్రమే కావాలి. ఆ దృష్టితో చూస్తే ఈ వారం ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని అనిపిస్తుంది’ అని చెప్పుకొచ్చాడు శేఖర్ బాషా.