సినిమా ఇండస్ట్రీ అంటేనే హీరోల మయం. కష్టం దర్శక రచయితలది. ఇక అందాల ఆరబోతతో మానసికంగా నలిగిపోయేది హీరోయిన్లు. డబ్బులు పెట్టి ఒక్కోసారి కోట్లు నష్టపోయేది నిర్మాతలు. కానీ సినిమా అంటే హీరోనే. స్టార్ హీరో డేట్స్ ఇప్పుడు అన్నిటి కంటే ముఖ్యం. అందుకే హీరోల రెమ్యునరేషన్ కూడా విచ్చలవిడిగా పెరిగి పోతూ ఉంటుంది.
పదేళ్ల క్రితం ఒక్కో హీరో పది కోట్లు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు అరవై కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అంటే.. కేవలం పది సంవత్సరాలలోనే హీరోల ఎదుగుదల పది కోట్లు నుండి అరవై కోట్లు వరకు. అయితే ఈ మధ్య కాలంలో హీరోలు మాత్రమే ఎదిగారు. నిర్మాతలు హీరోలకు మాత్రమే అడిగినంత ఇస్తున్నారు. కథ రాసి ఒప్పించిన రచయితకు చిల్లర ఇవ్వడానికే నిర్మాత ఉత్సాహం చూపిస్తూ ఉంటాడు.
సినిమా తీసి హిట్ చేసిన దర్శకుడి పరిస్థితి కూడా అంత గొప్పగా ఏమి లేదు. ఇక హీరోయిన్ల బాధ ఎవరికీ చెప్పుకోవాలి ? అసలు హీరో హీరోయిన్స్ పారితోషికాల మద్య వ్యత్యాసం చాలా ఎక్కువ. చాలా కాలంగా హీరోయిన్స్ ఈ విషయమై ఆవేదన చెందుతూనే ఉన్నారు. ఒక సినిమా హిట్ అవ్వాలంటే.. ఆ సినిమాలోని హీరోయిన్ అంగాంగ ప్రదర్శన చేయాలి.
ఇంత చేసి ఉపయోగం ఏముంది ? నిర్మాతలు డబ్బులు ఇవ్వడానికి మాత్రం ఆసక్తి చూపించరు. ఒకవేళ ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నా.. అందులో బోలెడు లొసుగులు ఉంటాయి. ఆ వ్యవహారాల వల్ల కొంతమంది హీరోయిన్లు ఇప్పటికీ కోలుకోలేక పోతున్నారు. అయినా హీరోలు ఎక్కువ తీసుకుంటే అది అతని క్రేజ్ అంటారు. అదే హీరోయిన్ ఎక్కువ తీసుకుంటే విమర్శలు చేస్తారు. ఈ విషయంలో హీరోయిన్లు మోసపోతూనే ఉన్నారు.