షుగర్ లెవెల్స్ ను కంట్రోల్‌లో ఉంచే ఆహార పదార్థాలివే..?

దేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహారం విషయంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ఎక్కువమంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ రోగులు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోతే మంచిది. తీపి పదార్థాలకు, డ్రింక్స్ కు దూరంగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ ను సులభంగా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. చిక్కుళ్లు, కిడ్నీ బీన్, పప్పులు ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. […]

Written By: Navya, Updated On : July 7, 2021 8:15 am
Follow us on

దేశంలో డయాబెటిస్ తో బాధపడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆహారం విషయంలో చేసే చిన్నచిన్న తప్పుల వల్ల ఎక్కువమంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. అయితే డయాబెటిస్ రోగులు కొన్ని ఆహార పదార్థాలను తీసుకోకపోతే మంచిది. తీపి పదార్థాలకు, డ్రింక్స్ కు దూరంగా ఉండటం వల్ల షుగర్ లెవెల్స్ ను సులభంగా కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.

చిక్కుళ్లు, కిడ్నీ బీన్, పప్పులు ఎక్కువగా తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. బీన్స్ వంటి పదార్థాలలో తక్కువ గ్లైసెమిక్ ఆహారాలు 90 రోజులు తీసుకుంటే హిమోగ్లోబిన్ ఎ1, సీ స్థాయిలు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తక్కువ గ్లైసెమిక్ ఉండే వాటిలో ఆపిల్ ఒకటి కాగా ఇందులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. రోజుకు ఒక ఆపిల్ తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉండే అవకాశం ఉంటుంది.

బాదం పప్పులో మెగ్నీషియం తక్కువగా ఉండటంతో పాటు ఇన్సులిన్ ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడంలో బాదం పప్పు కీలక పాత్ర పోషిస్తుంది. మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్, ఫైబర్ బాదంపప్పులో ఎక్కువగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో బాదంపప్పు తోడ్పడుతుంది. పాలకూరలో మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. బచ్చలికూరను ఆలివ్ నూనెలో వేయించుకుని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయని తెలుస్తోంది.

రక్తంలో షుగర్ లెవల్స్ తగ్గించడంలో వోట్మీల్ సహాయపడుతుంది. ఓట్స్ తక్కువ గ్లైసెమిక్ సూచనను కలిగి ఉంటాయనే సంగతి తెలిసిందే.