Bigg Boss 8 Telugu: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో కాస్త ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచే వారిలో ఒకరు శేఖర్ భాషా. ఇతనికి సంబంధించిన కంటెంట్ ని బిగ్ బాస్ టీం చాలా వరకు కట్ చేసి టెలికాస్ట్ చేస్తుంది. హాట్ స్టార్ లో ప్రసారమయ్యే లైవ్ లో కూడా ఎంతసేపు సోనియా, నిఖిల్, మణికంఠ మరియు విష్ణు ప్రియ వంటి వారి మీదనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు కానీ, శేఖర్ బాషా ని అసలు చూపించడం లేదు. మనకి చూపించిన ఆ కాస్త ఫుటేజీ లోనే శేఖర్ బాషా బోలెడంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. అయితే అతను ఎంత మంచి కంటెస్టెంట్ అనేది చెప్పేందుకు ఒక ఉదాహరణ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ లో అర్జున్ అంబటి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే.
ఆయన తన భార్య గర్భవతి గా ఉన్నప్పుడు, ఇంట్లో ఆమెని చూసుకునేందుకు ఎవ్వరూ లేని సమయంలో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టాడు. ఈ కోణం లో అర్జున్ కి బోలెడంత సానుభూతి దొరికింది. ఇప్పుడు శేఖర్ బాషా పరిస్థితి కూడా అంతే. ఆయన భార్య 9 నెలల గర్భవతి అని బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు ఒక ఇంటర్వ్యూ లో చెప్తాడు. సెప్టెంబర్ 14 వ తేదీన నా భార్య కి డెలివరీ అవుతుంది అని కూడా చెప్పాడు. కానీ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆయన ఈ విషయాన్నే ప్రస్తావించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఈ కోణాన్ని వాడుకుంటే శేఖర్ భాషా కి బోలెడంత సానుభూతి ఏర్పడేది, ఆయన గ్రాఫ్ కూడా పెరిగేది. కానీ ఈ అంశాన్ని ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం. ఎంత మంది కంటెస్టెంట్స్ ఇలా ఉంటారు చెప్పండి. ఈ వారం నామినేషన్స్ సమయం లో ఆదిత్య ఓం శేఖర్ బాషా ని నామినేట్ చేస్తూ, నువ్వు మనిషివి మాత్రమే ఇక్కడ ఉన్నావ్, మనసు వేరే దగ్గర ఉంది అంటూ కామెంట్ చేస్తాడు.
ఆరోజు ఆయన దేని గురించి అలా మాట్లాడాడో ఎవరికీ అర్థం కాలేదు కానీ, నేడు శేఖర్ భాషా పాత ఇంటర్వ్యూస్ చూసిన తర్వాత ఆ మాట వెనుక ఇంత అర్థం ఉందా అని అనుకుంటున్నారు ఆడియన్స్. ఒకపక్క తన భార్య ఎలా ఉందో అనే టెన్షన్ ని తన మనసులోనే దాచుకొని మదన పడుతున్న శేఖర్ బాషా, మరోపక్క హౌస్ లో అందరితో సరదాగా మాట్లాడుతూ, జోకులు వేస్తున్నాడంటే మామూలు విషయం కాదు. కనీసం ఈ వీకెండ్ లో అయినా నాగార్జున ఈ విషయాన్ని కంటెస్టెంట్స్ కి తెలిపి, తన భార్య కు సరైన పద్దతిలో డెలివరీ అయ్యిందా లేదా అనేది చెప్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.