https://oktelugu.com/

Jagapathi Babu: దొరికితే కమ్మోళ్ళు చంపేస్తారు, జగపతి బాబు కి స్ట్రాంగ్ వార్నింగ్!

సమాజంలో కుల పిచ్చి పాతుకు పోయింది. ఉద్యోగం, అవకాశాలు, పదవులు, గౌరవాలు, ప్రయోజనాల విషయంలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ గట్టిగా పని చేస్తుంది. కొన్ని సామాజిక వర్గాల్లో ఈ పిచ్చి మరింత ఎక్కువగా ఉంది. ఈ కుల పిచ్చి వలన తనకు ఎదురైన చేదు అనుభవాన్ని జగపతిబాబు ఓ సందర్భంలో పంచుకున్నారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 12, 2024 / 01:13 PM IST

    Jagapathi Babu

    Follow us on

    Jagapathi Babu: నటుడు జగపతిబాబు చాలా ఓపెన్ గా ఉంటారు. ఆయన వ్యాఖ్యలు కుండబద్దలు కొట్టినట్లు ఉంటాయి. ఓ ఇంటర్వ్యూలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ గురించి ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. చాలా ఏళ్ల క్రితం జగపతిబాబు విజయవాడ సిద్దార్థ్ కాలేజ్ కి ముఖ్య అతిథిగా వెళ్లారట. వేదిక మీద కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని ప్రిన్సిపాల్ తో అన్నారట. ఆడిటోరియం లో 2000 మంది ఉన్నారండి. అంతా కమ్మ కుల పిచ్చోళ్ళు. మీరు క్యాస్ట్ ఫీలింగ్ కి వ్యతిరేకంగా మాట్లాడితే ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. దయచేసి అలాంటి కామెంట్స్ చేయకండి, అన్నారట.

    కానీ జగపతి బాబు కుల పిచ్చికి వ్యతిరేకంగా మాట్లాడాడట. ఏంటి కమ్మ కమ్మ, వాళ్లే మనుషులా? మిగతా వాళ్ళు మనుషులు కాదా?. మీరు ఏమైనా అనుకోండి? ఏదైనా చేసుకోండి? కులం పేరిట మీరు చేసే పనులు మంచివి కావు. మర్డర్ లు చెయ్యడం, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ ఒప్పుకోకపోవడం, కూతుర్లను చంపేయడం ఏమిటీ… ఇవన్నీ నెగిటివ్, అన్నాను.

    ఆఖరికి ప్రిన్సిపాల్ చెప్పిన మాటలు కూడా నేను ప్రస్తావించాను. మీరు 2000 మంది ఉన్నారట. నన్ను నరికేస్తారట. నాకు సెక్యూరిటీ లేదు. నా వెపన్ కూడా తెచ్చుకోలేదు. ఏం చేస్తారో చూద్దాం, అన్నాను. సూపర్ అంటూ ఆడిటోరియం ఈలలతో మారుమ్రోగింది, అని జగపతిబాబు చెప్పుకొచ్చారు. నిజానికి జగపతిబాబు అదే సామాజిక వర్గానికి చెందినవాడు కావడం విశేషం. జీవితంలో జగపతిబాబు ప్రాక్టికల్ గా ఇది పాటిస్తారు.

    తన కూతురు విదేశీయుడిని ప్రేమిస్తే జగపతిబాబు వివాహం చేశారు. రెండో కూతురికి కూడా అబ్బాయిని వెతుక్కోమని చెప్పేశాను. నేను నీకు పెళ్లి చేయను. నీకు ఇష్టమైన వాడిని ఎంచుకుని పెళ్లి చేసుకోమని చెప్పానని ఓ ఇంటర్వ్యూలో జగపతిబాబు వెల్లడించారు. ఒక దశలో అవకాశాలు లేక జగపతిబాబు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారాక తిరిగి పుంజుకున్నాడు.

    లెజెండ్ మూవీలో మొదటిసారి విలన్ గా చేసిన జగపతిబాబు సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యంత డిమాండ్ కలిగిన నటుల్లో జగపతిబాబు ఒకరు. తెలుగుతో పాటు పలు భాషల్లో చిత్రాలు చేస్తున్నాడు. జగపతిబాబుకు పబ్స్, క్లబ్స్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం ఇష్టమైన వ్యవహారం.