Nagarjuna: చైతులో పూర్తి మార్పుని చూస్తారు – నాగార్జున

Nagarjuna: సంక్రాంతి కానుకగా నేడు బంగార్రాజు విడుదలవుతుండగా, ప్రచారంలో నాగార్జున మాట్లాడుతూ.. లవ్‌ స్టోరీలో నాగచైతన్యకు, బంగార్రాజులో చైతూకి పూర్తి మార్పుని చూస్తారు. బంగార్రాజు సినిమాలో బంగార్రాజు ఆత్మ చైతూలోకి ప్రవేశించాక తన బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్‌ పూర్తిగా మారిపోతుంది. నటనలో చైతూ అదరగొట్టాడు, ఈ పండక్కి బంగార్రాజే విన్నర్‌ గా నిలుస్తాడు’ అంటూ అక్కినేని నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌ చెప్పుకొచ్చాడు. అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ గా బంగార్రాజు రాబోతుంది. ఈ […]

Written By: Raghava Rao Gara, Updated On : January 14, 2022 11:06 am
Follow us on

Nagarjuna: సంక్రాంతి కానుకగా నేడు బంగార్రాజు విడుదలవుతుండగా, ప్రచారంలో నాగార్జున మాట్లాడుతూ.. లవ్‌ స్టోరీలో నాగచైతన్యకు, బంగార్రాజులో చైతూకి పూర్తి మార్పుని చూస్తారు. బంగార్రాజు సినిమాలో బంగార్రాజు ఆత్మ చైతూలోకి ప్రవేశించాక తన బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్‌ పూర్తిగా మారిపోతుంది. నటనలో చైతూ అదరగొట్టాడు, ఈ పండక్కి బంగార్రాజే విన్నర్‌ గా నిలుస్తాడు’ అంటూ అక్కినేని నాగార్జున చాలా కాన్ఫిడెంట్‌ చెప్పుకొచ్చాడు.

Nagarjuna

అక్కినేని నాగార్జున న‌టించిన “సోగ్గాడే చిన్ని నాయ‌న” సీక్వెల్ గా బంగార్రాజు రాబోతుంది. ఈ సినిమాలో నాగ్ డబుల్ రోల్ చేసాడు. తండ్రీ కొడుకులుగా కనిపించబోతున్నాడు. బంగార్రాజులో తాతగా అలాగే కొడుకుగా నాగ్ నటించాడు. ఇక మనవడుగా చైతన్య కనిపిస్తున్నాడు. అయితే, సెకండ్ హాఫ్ లో తండ్రి క్యారెక్టర్ వస్తుంది. ఇక సోగ్గాడే సినిమా ఎక్కడ ఎండ్ అయిందో.. బంగార్రాజు సినిమా అక్కడ నుంచి మొదలవుతుంది.

Also Read: తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండగే సంక్రాంతి.. సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

జనరేషన్ తేడా ఉంటుంది తప్పా బంగార్రాజు పాత్రలో తేడా ఉండదు. జీవితంలో మూడు దశల్లో ఉండే ప్రేమ కథతో ఈ సినిమా తీశారు. కథ అయితే చాలా బాగా నచ్చింది కానీ అనుకున్న సమయానికి ఈ సినిమాను తీయడమే పెద్ద సవాల్‌ అయింది. కారణం ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్‌ కు చాలా ఎక్కువ సమయం పట్టింది. రిలీజ్ విషయానికి వస్తే ముందు నుంచి సంక్రాంతికి అనుకున్నారు. అలాగే రిలీజ్ చేసున్నారు. ఇక నాగార్జున, నాగ చైతన్య పాత్రలు సమానంగా ఉంటాయట. అన్నట్టు ఈ సినిమాకి కూడా సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

Also Read: Jobs:  నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియాలో ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Tags