Mohan Babu: దర్శక రత్న దాసరి నారాయణ రావు తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పెద్ద ఎవరు అనే చర్చ చాలా కాలం నుంచి జరుగుతున్నది. మెగాస్టార్ చిరంజీవి అని కొందరు అన్నారు. కానీ, తాను ఇండస్ట్రీ పెద్దగా ఉండబోనని, ఇండస్ట్రీ బిడ్డగా ఉండి, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని, కష్టాలొచ్చినపుడు తన వంతు బాధ్యతగా పనులు చేస్తానని అన్నాడు. ఇక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో అన్నీ తానై వ్యవహరించారు సీనియర్ హీరో మోహన్ బాబు. తన తనయుడు మంచు విష్ణు మా ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు ఇండస్ట్రీ పెద్దగా ఉంటారనే చర్చ స్టార్ట్ అయింది.
ఇకపోతే గత కొద్ది కాలం నుంచి ఏపీ సర్కారు, టాలీవుడ్ మధ్య యుద్ధం జరుగుతున్నది. థియేటర్లలో టికెట్ల ధరల తగ్గింపును పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలు కొందరు అనుచిత వ్యాఖ్యలు చేస్తుండగా వాటికి సినీ పరిశ్రమ నుంచి కౌంటర్స్ కూడా ఇస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఇటీవల వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అమరావతి వెళ్లి తన వాదనను వినిపించాడు. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని, అధికారులకు పలు విషయాలు వివరించాడు.
Also Read: తెలుగు రాష్ట్రాలలో పెద్ద పండగే సంక్రాంతి.. సంక్రాంతి ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?
తాజగా ఏపీ సీఎం జగన్ పిలుపు మేరకు మెగాస్టార్ చిరు ఆయనతో భేటీ అయ్యారు. .జగన్ నుంచి పిలుపు వచ్చిన వెంటనే చిరంజీవి.. వెళ్లి సినీ ఇండస్ట్రీలోని సమస్యలు వివరించి పరిష్కరించాలని కోరారు. ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సీఎం సానుకూలంగా స్పందించారని వివరించాడు.కాగా, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ప్రెసిడెంట్‌గా ఉన్న మంచు విష్ణు, ఆయన తండ్రి మోహన్ బాబును కాదని చిరుకు ఆహ్వానం పంపడం ఏంటని కొందరు అంటున్నారు. ఈ క్రమంలోనే త్వరలోనే మోహన్ బాబుకు కూడా ఏపీ సర్కారు నుంచి పిలుపు వస్తుందని అంటున్నారు.
ఎందుకంటే చిరు వద్దన్న పెద్దన్న పోస్టుని తన దగ్గరే ఉంచుకుని, దాసరి శిష్యుడిగా ఆయన వారసత్వం కొనసాగించాలనుకున్నాడాయన. అందుకే ఈమధ్య సీరియస్‌గా ఓ ఉత్తరం రాశారు. జగన్ ని కలవాలని, పరిశ్రమ తరపున బాధలు చెప్పుకోవాలని, అలా.. చిత్రసీమలో పెదరాయుడు పాత్ర పోషించాలని అనుకున్నారు మోహన్ బాబు. చిరు – జగన్‌ల తాజా భేటీతో ఆ కల కలగానే మిగిలిపోయింది. అయితే మోహన్ బాబు అంత తేలిగ్గా వెనుకంజ వేసేరకం కాదు. ఆయన దగ్గర ఏదో ఓ వ్యూహం ఉండే ఉంటుంది.
వీలైనంత త్వరలో జగన్ ని వ్యక్తిగతంగా కలవాలన్నది ఆయన ఆలోచన. జగన్ తనకు బంధువు కాబట్టి.. ఆ రూపంలో అయినా, ఒకసారి కలిసి వచ్చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు. జగన్ అప్పాయింట్ మెంట్ కూడా మోహన్ బాబుకి దొరికిందని, త్వరలోనే ఈ భేటీ కూడా జరగబోదోందని ఓ టాక్ వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. త్వరలో చర్చల కోసం మోహన్ బాబును కూడా ఆహ్వానిస్తారని టాక్.