Pushpa 2: ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన పాన్ ఇండియా సినిమాలలో ఒక్కటి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా..ఈ సినిమా పై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ కోలీవుడ్ మరియు బాలీవుడ్ వంటి ఇండస్ట్రీలలో ఎలాంటి అంచనాలు లేవు..ఇతర రాష్ట్రాలలో అతి తక్కువ అంచనాల మధ్య విడుదల అయినా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనమే సృష్టించింది..ముఖ్యంగా బాలీవుడ్ జనాలు అయితే అల్లు అర్జున్ యాక్టింగ్ కి సుకుమార్ టేకింగ్ కి ఫిదా అయ్యిపోయారు..క్రికెటర్స్ దగ్గర నుండి రాజకీయ నాయకులూ వరుకు ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ మేనియా లో మునిగిపోయారు..ఎక్కడ చేసిన తగ్గేదేలే అంటూ ప్రతి ఒక్కరు సోషల్ మీడియా లో పోస్టింగ్ లు పెడుతూ ఇప్పటికి హల్చల్ చేస్తూనే ఉన్నారు..ఇంతతి ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకి అతి త్వరలోనే సీక్వెల్ రాబోతున్న సంగతి మన అందరికి తెలిసిందే..దీనికి సంబంధించిన లేటెస్ట్ వార్త ఒక్కటి సోషల్ మీడియా లో సెన్సషనల్ గా మారింది.

అదేమిటి అంటే పుష్ప సినిమా ముందు వరుకు 35 కోట్ల రూపాయిల పారితోషికం తీసుకునే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్..పుష్ప సినిమా జాతీయ స్థాయి ప్రభంజనం సృష్టించడం తో అల్లు అర్జున్ పుష్ప 2 కి ఏకంగా 100 కోట్ల రూపాయిల పారితోషికం డిమాండ్ చేస్తునట్టు సమాచారం..ఒక్కవేల పారితోషికం అంత ఇవ్వలేకపోతే హిందీ థియేట్రికల్ రైట్స్ మొత్తం తన పేరు మీదనే రాయాలి అని డిమాండ్ చేస్తున్నాడు అట..ఇదే కనుక జరిగితే అల్లు అర్జున్ జాక్ పాట్ కొట్టినట్టే.
Also Read: Acharya OTT Release: ఆచార్య OTT రిలీజ్ డేట్ అప్పుడేనా..?
ఎందుకంటే బాలీవుడ్ లో సీక్వెల్స్ కి ఉండే క్రేజ్ వేరు..ఇటీవలే KGF పార్ట్ 2 సినిమా అక్కడ సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సుమారు 450 కోట్ల రూపాయిల నెట్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది ఆ సినిమా..ఇక పుష్ప 2 క్రేజ్ అయితే నార్త్ సర్కిల్ లో ఊహాతీతం అనే చెప్పాలి..సరైన టైం లో ఈ సినిమాని విడుదల చేస్తే బాలీవుడ్ లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని ట్రేడ్ వర్గాల అంచనా.

ఇక ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ విషయం లో సుకుమార్ మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నాడు..పార్ట్ 1 వల్ల పార్ట్ 2 పై జనాల్లో భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యం లో క్రిప్ట్ ని అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా తయారు చేస్తున్నాడు అట సుకుమార్..ఇప్పటికే దాదాపుగా చివరి దశకి చేరుకున్న స్క్రిప్ట్ మే నెలాఖరు లోపు కాస్టింగ్ కి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ పూర్తి చేసి జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడు అట..ఈ పార్ట్ 2 లో బాలీవుడ్ నటులకు కూడా స్కోప్ ఉండేలా చూస్తున్నాడు అట..భారీ అంచనాలు ఏర్పర్చుకున్న ఈ సినిమా ఆ అంచనాలను ఎంత వరుకు అందుకుంటుందో తెలియాలి అంటే ఈ ఏడాది డిసెంబర్ వరుకు వేచి చూడాల్సిందే.
Also Read:IPL CSK: సంచలనం.. జడేజా ఫ్లాప్.. ‘చెన్నై’ పగ్గాలు ధోనికే బ్యాక్..