Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 డల్ గా ఉండి రేటింగ్ తక్కువ రావడంతో కావచ్చు ఈ సారి యాజమాన్యం ప్లాన్ మార్చింది. దీంతో ఈ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఉల్టా ఫుల్టా అంటూ కొత్త టాస్కులు, గొడవలతో ఇల్లును దద్దరిల్లేలా చేస్తున్నారు. ఆసక్తికరమైన టాస్కులతో, ఊహించని ట్విస్టులతో ప్రతి రోజు ఏదో ఒక కొత్త ధనంతో ఆసక్తిని పెంచుతున్నారు బిగ్ బాస్. దీంతో టాప్ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకొని పోతుంది ఈ సీజన్. అంతే కాదు ప్రతి రోజు కనీసం 10 పాయింట్స్ కి తక్కువ కాకుండా వస్తున్నాయట. ఇందులో మరో ఇంట్రెస్టింగ్ ఏంటంటే.. హౌస్ నుంచి వెళ్లిపోయిన కంటెస్టెంట్స్ మళ్లీ తిరిగి లోపలికి రావడం.. ఇదే క్రమంలో రతిక కూడా ఇంటి నుంచి వెళ్లిపోయి మళ్లీ వచ్చింది.
ఈ సీజన్ లో ప్రతీ కంటెస్టెంట్ తమ ఆటని ఎంతో అద్భుతంగా ఆడుతూ ముందుకు దూసుకుపోతున్నారు. కానీ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా రతిక కాస్త నెమ్మదిగానే ఉందని చెప్పాలి. హౌస్ లో కన్నింగ్ బాండింగ్స్ నడుస్తూ పల్లవి ప్రశాంత్ , యావర్ గేమ్స్ ని చెడగొట్టడానికి చూసిన రతిక ఓట్లు రాకపోవడంతో బయటకు వెళ్లింది. అంతేకాదు ప్రశాంత్ తో కన్నింగ్ గా ఉంటూ.. ఆయనతో లవ్ ట్రాక్ నడిపి చివరకు ఆయననే తిట్టింది. దీంతో ప్రేక్షకులకు రతికపై మరింత కోపం వచ్చింది. ఇలా తన ప్రవర్తన నచ్చకపోవడంతో ఇంటినుంచి పంపేశారు బిగ్ బాస్ ప్రేక్షకులు. చివరకు మళ్లీ ఆమెను అదృష్టం వరించడంతో తిరిగి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చింది.
రీ ఎంట్రీ తర్వాత అయినా తన తప్పులని తెలుసుకొని బాగా ఆడుతుంది అనుకుంటే, ఇప్పుడు కూడా తన పాత స్టాటజీనే పాటిస్తుంది అమ్మడు. రెండు వారాలు బయటకు వెళ్లిన తర్వాత ఆమె సోషల్ మీడియా లో ఎవరికి ఎక్కువ ఫాలోయింగ్ ఉంది?, ఏ గ్రూప్ లోకి వెళ్తే సేఫ్ అవుతాము అనేది బాగా గమనించి శివాజీ బ్యాచ్ లోకి వెళ్ళింది. ఇక నుంచి వారి టీమ్ లోనే ఉంటాను అంటూ తెలిపింది. అంతేకాదు ఒక్కొక్కరిని నామినేషన్ లోకి లాగి బయటకు పంపిద్దాం అంటూ మొన్న ప్రిన్స్ యావర్ తో చెప్పింది రితికా.
ప్రశాంత్ విషయంలో నెగిటివిటీ మూటగట్టుకున్న ఈ అమ్మడు మళ్లీ ఆయనతోనే మాట్లాడేందుకు, జతకట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ముందుగా భోలే శవాలీ తో కలిసి పల్లవి ప్రశాంత్ వద్దకు వెళ్లి, మొట్టమొదటి కెప్టెన్ అయినందుకు ధన్యవాదాలు అని తెలిపింది. ఆ తర్వాత భోలే శవాలీ వీళ్ళిద్దరికి కలిపే విధంగా ప్రేమ పాటలు పాడారు. దానికి రతికా వైపు నుంచి చాలా పాజిటివ్ రియాక్షన్ వచ్చాయి. అంటే మళ్లీ ప్రశాంత్ తో లవ్ ట్రాక్ నడపాలని చూస్తుందా? అయినా ఆయనతో అక్కా అని పిలిపించుకొని మళ్లీ కనుక ప్రేమతో మాట్లాడితే ఈ సారి మళ్లీ బయటకు వెళ్లడం ఖాయం అంటున్నారు బిగ్ బాస్ ప్రేక్షకులు.