Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాదు, కోలీవుడ్ , మాలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం దుమ్ము లేపేసింది.బాహుబలి మరియు KGF సిరీస్ తర్వాత అన్నీ బాషలలో అద్భుతమైన వసూళ్లను రాబట్టిన సినిమా ఇదే.
అలాంటి సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప : ది రూల్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గత కొంత కాలం క్రితం షూటింగ్ కార్యక్రమాలను మొదలు పెట్టుకున్న ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ వీడియో అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసారు. ఈ వీడియో కి మరియు ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది.
అల్లు అర్జున్ ఈసారి ఈ చిత్రం తో ఏకంగా వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టబోతున్నాడని విశ్లేషకులు సైతం అంచనా వేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ చిత్రం విడుదల కాబోతుంది.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో రష్మిక మండన పాత్ర చనిపోతుందని, ఆమె పాత్ర ఇందులో ఎంతో ఎమోషనల్ గా ఉంటుందని సోషల్ మీడియా లో ఒక ప్రచారం జరుగుతుంది.ఈ చిత్రం లో రష్మిక మండన చనిపోయినట్టు ఉన్న ఫోటో సోషల్ మీడియా లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.
ఇది పుష్ప సినిమాలోని ఫోటోనే అని ఫ్యాన్స్ అంటున్నారు. మరో పక్క ఇది పుష్ప సినిమా కాదు, మలయాళం లో రష్మిక నటిస్తున్న ఒక చిత్రానికి సంబంధించిన ఫోటో అని అంటున్నారు. వీటిల్లో ఏది నిజం ఏది అబద్దం అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ ఈ ఫోటో పుష్ప సినిమాలోది అయితే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.