Ram Charan National Award expectations: సోషల్ మీడియా లో కానీ , బయట కానీ ఎక్కడ చూసిన ఇప్పుడు ‘పెద్ది’ మేనియా నే కనిపిస్తోంది. గత నాలుగు నెలలుగా సరైన సినిమా లేక , థియేటర్స్ కి తాళాలు వేసుకునే పరిస్థితి ఏర్పడడం తో , ఎక్సిభిటర్స్ కి ఏమి చెయ్యాలో తోచక దిక్కు తోచని పరిస్థితిలో , ఎన్నో ఆశలతో పెద్ది చిత్రం కోసం పడిగాపులు కాసారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం విడుదల తర్వాత థియేటర్స్ కిక్కిరిసిపోయాయి , ఎక్కడ చూసినా ట్రేడ్ వర్గాలకు పండుగ వాతావరణం కనిపిస్తోంది. ఈ బాక్స్ ఆఫీస్ సునామీ ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో చూడాలి. ఇది కాసేపు పక్కన పెడితే, ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు ఏ రేంజ్ ప్రశంసలు దక్కాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమా నిలబడిందంటే అందుకు కారణం రామ్ చరణ్ నటనే అని , ఆయనకు ఈసారి నేషనల్ అవార్డు రావాల్సిందే అని అంటున్నారు.
అయితే రామ్ చరణ్ కి ఈసారైనా నేషనల్ అవార్డు వస్తుందా అంటే అనుమానమే. ఎందుకంటే 2018 వ సంవత్సరం లో ఆయన హీరో గా నటించిన ‘రంగస్థలం’ చిత్రం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం లోని రామ్ చరణ్ నటన ఒక బెంచ్ మార్క్ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఎవరైనా తమ హీరో బాగా చేస్తే , రంగస్థలం లో రామ్ చరణ్ రేంజ్ యాక్టింగ్ అంటూ పోలుస్తుంటారు , ఆ స్థాయి లో ఆయన నటించాడు. కానీ ఆ నటనకు గుర్తింపుగా నేషనల్ అవార్డు రాలేదు. కానీ అదే ఏడాదిన విడుదలైన విక్కై కౌశల్ ‘URI : ది సర్జికల్ ఎటాక్’ చిత్రం విడుదలైన పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాలో హీరో గా నటించినందుకు గానూ విక్కీ కౌశల్ కి ఈ అవార్డు ని అందించారు.
ఆ సమయం లో నేషనల్ అవార్డు జ్యురి పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రంగస్థలం కి మించిన నటన విక్కీ కౌశల్ URI లో చెయ్యలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ రామ్ చరణ్ ని పక్కకి నెట్టి , హిందీ వాడికి ఛాన్స్ ఇచ్చారు; ఇప్పుడు కూడా అదే జరగబోతుందేమో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏడాది ధురంధర్ 2 విడుదలైన సెన్సేషన్ సృష్టించింది. అంతే కాదు , ఈ చిత్రం లో రణవీర్ సింగ్ నటన ఊహాతీతం , ఆయనకు నేషనల్ అవార్డు ఇవ్వడం లో ఎలాంటి తప్పు లేదు , కానీ అదే సమయం లో రామ్ చరణ్ కూడా అదే స్థాయి నటన కనబర్చాడు , మరి నేషనల్ అవార్డు జ్యురి సభ్యులు రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు ప్రకటిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి.
