Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Sukumar movie update: సుకుమార్ కథల మీద మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించడం...

Mahesh Babu Sukumar movie update: సుకుమార్ కథల మీద మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపించడం లేదా..? కారణమేంటంటే..?

Mahesh Babu Sukumar movie update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చే సినిమాల్లో వైవిధ్యమైన కథాంశం ఉంటుందని ప్రేక్షకులందరు నమ్ముతుంటారు. ముఖ్యంగా ఆయన చిన్న చిన్న పజిల్స్ ని ప్రేక్షకులకు ఇస్తాడు. ఒక సీన్ లో అంతర్లీనంగా అవి ఉంటాయి. అవి కొంతమంది సుకుమార్ ని ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా అతని డెప్త్ అర్థమవ్వాలంటే కొంచెం ఐక్యూ ఉండాలి. ఆయన […]

Mahesh Babu Sukumar movie update: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇంటలిజెంట్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్… ఆయన నుంచి వచ్చే సినిమాల్లో వైవిధ్యమైన కథాంశం ఉంటుందని ప్రేక్షకులందరు నమ్ముతుంటారు. ముఖ్యంగా ఆయన చిన్న చిన్న పజిల్స్ ని ప్రేక్షకులకు ఇస్తాడు. ఒక సీన్ లో అంతర్లీనంగా అవి ఉంటాయి. అవి కొంతమంది సుకుమార్ ని ఫాలో అయ్యే వారికి మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా అతని డెప్త్ అర్థమవ్వాలంటే కొంచెం ఐక్యూ ఉండాలి. ఆయన ఏ సన్నివేశాన్ని ఎలా చిత్రీకరిస్తున్నాడు అనేది చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తేనే తెలుస్తుంది. లేకపోతే మాత్రం ఆడియన్స్ లాగే సినిమాని చూడాల్సి ఉంటుంది. మొత్తానికైతే సుకుమార్ తన మార్క్ ఇంటెన్సిటీని అందిస్తూ ప్రేక్షకులందరిలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుతుంటాడు.

ముఖ్యంగా స్టార్ హీరోలందరికి సక్సెస్ లను అందిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ‘వన్ నేనొక్కడినే’ సినిమాతో మహేష్ బాబుకి ఫ్లాప్ ని కట్టబెట్టిన సుకుమార్ ఆ సినిమా మేకింగ్ విషయంలో మాత్రం చాలా వరకు ప్రశంసలను అందుకున్నాడు. ఇక వీళ్ళ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుంది అంటూ గతంలో కొన్ని వార్తలైతే వచ్చాయి.

ముఖ్యంగా రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్ మహేష్ బాబు తోనే సినిమా చేయాల్సి ఉంది. కానీ అనుకొని కారణాలవల్ల అతను పుష్ప సినిమా చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి సుకుమార్ తో సినిమా చేయడానికి మహేష్ బాబు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట. కానీ ఈ మధ్యకాలంలో సుకుమార్ చెప్పిన కథలేవీ మహేష్ బాబుకు పెద్దగా ఇంప్రెసివ్ గా అనిపించడం లేదు.

కారణం ఏంటంటే మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాబట్టి ఎలాగైనా సరే కథ ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండాలి. అంతే తప్ప నార్మల్ కథతో ముందుకు వెళ్తే వర్కౌట్ అవ్వదని మహేష్ చెప్పారట. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మరోసారి మహేష్ బాబు తో జతకడతాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper