Rajamouli Mahabharat: #RRR చిత్రం తో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి , అతి త్వరలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక యాక్షన్ అడ్వెంచర్ సినిమా తియ్యబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా పూర్తి చేసుకోబోతుంది. ఇందుకోసం మహేష్ బాబు కి మూడు నెలలు వర్క్ షాప్ లో ట్రైనింగ్ ఇవ్వబోతున్నారట.
ఆగష్టు 9 వ తారీఖున మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా పూజ కార్యక్రమాలు జరుపుకోబోతున్నట్టు సమాచారం. ఆరోజే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఇది ఇలా ఉండగా రీసెంట్ గా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూ లో #RRR చిత్రానికి సీక్వెల్ ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ సీక్వెల్ హాలీవుడ్ చిత్రం గా తెరకెక్కబోతుందని, దీనికి రాజమౌళి దర్శకత్వం వహించొచ్చు, లేకపోవచ్చు అని చెప్పుకొచ్చాడు.
అయితే మహేష్ బాబు సినిమా పూర్తయిన తర్వాత రాజమౌళి వెంటనే ‘మహాభారతం’ సినిమాని తెరకెక్కించబోతున్నాడని కూడా విజయేంద్ర ప్రసాద్ ఈ సందర్భంగా తెలిపాడు. ఈ మహాభారతం సినిమా కేవలం ఒక్క భాగం తో చెప్పేది కాదని, కనీసం 8 భాగాలు పడుతుందని గతం లో రాజమౌళి చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. బహుశా ఈ సిరీస్ తో రాజమౌళి సినిమాలకు గుడ్ బై చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. అయితే ఈ మహాభారతం కి సంబంధించిన క్యాస్టింగ్ గురించి సోషల్ మీడియా లో ఒక వార్త లీక్ అయ్యింది.
ఇందులో శ్రీ కృష్ణుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా ప్రభాస్, భీముడిగా ఎన్టీఆర్, ధర్మరాజు గా పవన్ కళ్యాణ్, దుర్యోధనుడిగా రానా, భీష్ముడిగా రజినీకాంత్ మరియు ద్రోణాచారుడిగా అమితాబ్ బచ్చన్ ,ద్రౌపది గా దీపికా పదుకొనె నటించే ఛాన్స్ ఉందని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా బయటకి రానున్నాయి టాక్.