Rajamouli Vs Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ డైరెక్టర్లు మాత్రమే గుర్తుకొస్తారు. నిజానికి మీడియం రేంజ్ దర్శకులు సైతం సినిమాలను చేస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నప్పటికి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తున్న దర్శకులను మాత్రమే వాళ్లు గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళే టాప్ లెవెల్ కి వెళుతూ ఉంటారు. అలాగే వాళ్ళ సినిమాలను చూడడానికి యావత్తు ప్రేక్షకులోకమంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియాలో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి…ఆ తర్వాత చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమాతో ఆయనకు ఎనలేని క్రేజ్ అయితే వచ్చింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబుతో చేస్తున్న సినిమా విషయంలో ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. హాలీవుడ్ సినిమా అయిన ఇండియానా జోన్స్ కి ఇన్స్పిరేషన్ గా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ సినిమాతో రాజమౌళి తనను తాను వరల్డ్ స్థాయిలో ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి తెలుగు సినిమా ప్రేక్షకులతో పాటు ఇండియన్ సినిమా ప్రేక్షకులు సైతం ఈ సినిమాకి ఫిదా అవ్వక తప్పదనే చెప్పాలి. ఇక ఇలాంటి సందర్భంలో రాజమౌళి కి పోటీని ఇచ్చే దర్శకులు ఎవరు అనే కోణంలో కొన్ని ఆలోచనలైతే వస్తున్నాయి.
Also Read: సందీప్ రెడ్డి వంగ తో పోటీ పడే కెపాసిటీ బాలీవుడ్ డైరెక్టర్స్ కి లేదా..?
ముఖ్యంగా రాజమౌళికి పోటీని ఇచ్చే దర్శకులు ఇండియాలో ఎవరు లేరంటు కొన్ని వాదనలు వినిపిస్తున్నప్పటికి రాజమౌళి సైతం తనకు పోటీ ఇచ్చే దర్శకుడు ఒకరున్నారు అంటూ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ అతను ఎవరు అంటే సందీప్ రెడ్డివంగ… ప్రస్తుతం సందీప్ రెడ్డివంగా ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా దాదాపు 700 కోట్ల బడ్జెట్ తో పాన్ వరల్డ్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో ఆయన కూడా వరల్డ్ లెవెల్లో తనను తాను ఎలివేట్ చేసుకోవాలని చూస్తున్నాడు.
మరి వీళ్ళిద్దరూ అనుకున్నట్టుగానే భారీ సక్సెస్ ను సాధిస్తారా? వీళ్ళిద్దరిలో ఎవరి సినిమా టాప్ లెవెల్లో సక్సెస్ చేసి చూపిస్తారు. తద్వారా ఇద్దరూ తెలుగు సినిమా ఇండస్ట్రీకి గొప్ప గుర్తింపును తీసుకొచ్చి పెడతారా? లేదంటే ఇద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే టాప్ లెవెల్ కి వెళ్తారా అనేది తెలియాలంటే మాత్రం వీళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…