Balakrishna Best Movie: నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపైతే ఉంది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుకోవడంతో ఆ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో ఎంట్రీ అయితే దొరికింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు బాలయ్య బాబు, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లాంటి నటులు నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బాలయ్య బాబు ఒకప్పుడు మాస్ హీరోగా మంచి ఇమేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగాడు… యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనను మించిన నటుడు మరొకరు లేరు అనేంతల గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. కెరియర్ మొదట్లోనే డిఫరెంట్ పాత్రలను పోషించిన బాలయ్య తన ఎంటైర్ కెరీర్ లో చేసిన అన్ని సినిమాల్లో తనకు ఎక్కువగా నచ్చిన సినిమాలు ఏంటి అనే విషయం మీద గతంలో తన అభిప్రాయాన్ని తెలియజేశాడు. ముఖ్యంగా అతనికి భైరవద్వీపం, ఆదిత్య 369 సినిమాలంటే చాలా ఇష్టమట. ఇక వాటితో పాటుగా సమరసింహారెడ్డి సినిమా అంటే కూడా తనకు చాలా ఇష్టమని పలు సందర్భాల్లో తెలియజేశాడు. ఎందుకంటే తనకు ఇష్టమైన లక్ష్మీనరసింహస్వామి టైటిల్ వచ్చే విధంగా సమరసింహారెడ్డి అని పేరు పెట్టడం అది మాస్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకొని సూపర్ సక్సెస్ గా నిలవడంతో బాలయ్య బాబుకి నటసింహం అనే బిరుదును కూడా కట్టబెట్టింది. దాంతో అప్పటి నుంచి బాలయ్య బాబుకి మాస్ లో ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందనే చెప్పాలి. ఇక ఇలాంటి బాలయ్య బాబు తన కెరియర్ లో వైవిద్యమైన పాత్రలను పోషించాడు.
Also Read: సందీప్ రెడ్డి వంగ తో పోటీ పడే కెపాసిటీ బాలీవుడ్ డైరెక్టర్స్ కి లేదా..?
ముఖ్యంగా మైథాలజికల్ సినిమాలను కూడా చేసి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. రాముడిగా కృష్ణుడిగా పలు పాత్రల్లో నటించి యావత్ తెలుగు ప్రేక్షకులందరిని మెప్పించే ప్రయత్నం అయితే చేశాడు. ఇప్పటికీ బాలయ్య బాబు చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెడుతున్నవే కావడం విశేషం…
ఇక ఇప్పటికే వరుసగా నాలుగు విజయాలతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్య ఇప్పుడు అఖండ 2 సినిమాతో మరోసారి భారీ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగబోతున్నాడు. ఇక ఈ సినిమాతో కూడా సక్సెస్ ని సాధిస్తే సీనియర్ హీరోలు ఎవరికి సాధ్యం కానీ రీతిలో వరసగా ఐదు విజయాలను అందుకున్న నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకుంటాడు…
ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమాకి రీసెంట్ గా నేషనల్ అవార్డు రావడంతో బాలయ్య బాబు ఇమేజ్ మరింతగా పెరిగింది. అలాగే ఆయన స్టోరీ సెలక్షన్లో కూడా చాలా మంచి విషయం ఉంటుందని ప్రతి ఒక్కరు అతన్ని అభినందిస్తున్నారు…