https://oktelugu.com/

Raasi : ప్చ్.. రాశి ప్రయత్నాలు ఫలిస్తాయా ?

తెలుగు సీనియర్ హీరోయిన్ ‘రాశి’ ప్రస్తుతం అవకాశాలు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, ఆమెకు మాత్రం ప్రస్తుతానికి సినిమా ఛాన్స్ లు రావడం లేదు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తోంది. ఇప్పటికీ తనలో నటి ఉందని, తనకు నటన పై తపన ఉందని ఇన్ డైరెక్ట్ గా మేకర్స్ కి సిగ్నల్స్ పాస్ చేస్తోంది. కాకపోతే రాశికి సీరియల్సే ఎక్కువ వస్తున్నాయి. అప్పట్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. […]

Written By:
  • admin
  • , Updated On : August 14, 2021 / 03:52 PM IST
    Follow us on

    తెలుగు సీనియర్ హీరోయిన్ ‘రాశి’ ప్రస్తుతం అవకాశాలు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే, ఆమెకు మాత్రం ప్రస్తుతానికి సినిమా ఛాన్స్ లు రావడం లేదు. అందుకే ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తోంది. ఇప్పటికీ తనలో నటి ఉందని, తనకు నటన పై తపన ఉందని ఇన్ డైరెక్ట్ గా మేకర్స్ కి సిగ్నల్స్ పాస్ చేస్తోంది. కాకపోతే రాశికి సీరియల్సే ఎక్కువ వస్తున్నాయి.

    అప్పట్లో స్టార్ హీరోల సరసన ఆడిపాడింది. హీరోయిన్ గా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి క్రేజ్ సంపాదించింది. కానీ పెళ్లి తర్వాత పదిహేను పదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. చాల గ్యాప్ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. కానీ మిగిలిన సీనియర్ భామలు కూడా సహాయ పాత్రల కోసం పోటీ పడుతున్నారు.

    దాంతో భారీ కాంపిటీషన్ మధ్య రాశికు చెప్పుకోతగ్గ ఒక్క సినిమా కూడా రావడం లేదు. కనీసం సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా రాశికి ఏ హీరో, ఏ దర్శకుడు ఆఫర్ ఇవ్వట్లేదు. దాంతో తానే నిర్మాతగా మారి ఒక సీరియల్ చేస్తోంది. గతంలో కూడా రాశి తన భర్తను దర్శకుడిగా నిలబెట్టడానికి రెండు సినిమాలను నిర్మించింది.

    కానీ ఆ సినిమాలు దారుణంగా ప్లాప్ అవడంతో రాశి బాగా నష్టపోయింది. దాంతో ఆమెకు ఆ మధ్య ఆర్ధిక సమస్యలు కూడా తలెత్తాయి. అందుకే, మళ్ళీ నటిగా బిజీ కావాలని రాశి ఆరాటపడుతుంది. ఎలాగైనా మళ్ళీ సినిమాల్లో బిజీ అయి కోల్పోయిన డబ్బును తిరిగి సంపాధించుకోవాలని రాశి గత రెండు సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తోంది. మరి రాశి ప్రయత్నాలు ఫలిస్తాయా ? చూడాలి.