https://oktelugu.com/

Pushpa 2 : పుష్ప 2 సినిమా సక్సెస్ అవుతుందా..? భారీ హైప్ సినిమాకి దెబ్బ కొట్టే ప్రమాదం ఉందా..?

తెలుగు సినిమా స్థాయి అనేది రోజురోజుకి పెరుగుతుంది. ముఖ్యంగా హీరోలందరూ వాళ్ళ స్టార్ డమ్ ను పెంచుకోవడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలు సైతం సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టిస్తున్నారు. ఇక మరోసారి ఆయన భారీ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు...

Written By:
  • Gopi
  • , Updated On : October 10, 2024 / 05:08 PM IST

    Pushpa2

    Follow us on

    Pushpa 2 :  అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుస్ప 2 సినిమా మీద భారీ హైప్ అయితే ఉంది. ఇక ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఆగస్టు 15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది .కానీ మొదట్లో ఈ సినిమాకు చాలా భారీ హైప్ అయితే క్రియేట్ అయింది. ఇక ఎప్పుడైతే డేట్ చేంజ్ చేశారో అప్పటినుంచి కొంతవరకు హైప్ తగ్గింది. మరి ఇప్పుడు మరోసారి పుష్ప 2 సినిమా హైప్ అనేది టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక దేవర సినిమా రిలీజ్ అయి సూపర్ సక్సెస్ అయిన నేపధ్యంలో దేవరతో పుష్ప సినిమాను పోలుస్తూ అల్లు అర్జున్ బరిలోకి దిగితే ఎన్టీఆర్ సాధించిన సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు రాబడతారంటూ అతని అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన కామెంట్లైతే చేస్తున్నారు.

    మరి దీని మీద ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతవరకు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా కూడా పుష్ప 2 సినిమా మీద భారీ హైట్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక ఇంతకుముందు పుష్ప సినిమా మీద కూడా భారీ హైప్ ఉండటం వల్లే తెలుగులో ఈ సినిమాకి డివైడ్ టాక్ అయితే వచ్చింది.

    ఇక బాలీవుడ్ లో మాత్రం ఎలాంటి హైప్ లేకుండా రిలీజ్ అవ్వడంతో ప్రేక్షకులను ఆ సినిమా భారీగా ఇంప్రెస్ చేసింది. కానీ ఇప్పుడు పుష్ప 2 సినిమా మీద బాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ అయితే ఉంది. మరి ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవాలి అంటే మాత్రం ఈ సినిమా అవుట్ అఫ్ ది బాక్స్ గా నిలవాలి. లేకపోతే మాత్రం బాలీవుడ్ ప్రేక్షకులు తీవ్రంగా నిరాశపడే అవకాశాలైతే ఉన్నాయి.

    ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకి భారీ హైప్ ఉండడం అనేది ఈ మూవీ కి ఎంత ప్లస్ అవ్వనుందో అంతే మైనస్ గా కూడా మారే అవకాశాలైతే ఉన్నాయి. ఇక వీటన్నింటిని జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాను చాలా బాగా తెరకెక్కించే ప్రయత్నంలో సుకుమార్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏ మిస్టేక్ చేయకుండా సుకుమార్ ఈ సినిమాని సూపర్ సక్సెస్ చేసి దాదాపు 1500 కోట్ల వరకు కలెక్షన్లను కొల్లగొట్టాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది…