https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : హౌస్ లో సిగరెట్లు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన విష్ణు ప్రియ..తెలుగు అమ్మాయి అయ్యుండి ఒక్క మంచి లక్షణం లేదుగా!

ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల ముందు నటించే మహానటులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆ జాబితాలో మణికంఠ, విష్ణు ప్రియ ని తీసుకోవచ్చు. మణికంఠ ని కాసేపు పక్కన పెడుదాం, ఇతనిది వేరే క్యాటగిరీ. కానీ విష్ణు ప్రియ గురించి మాత్రం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె వారం మొత్తం ఎపిసోడ్స్ లో ఒకలాగా, వీకెండ్ ఎపిసోడ్స్ లో మాత్రం మరొకలాగా అనిపిస్తూ ఉంటుంది.

Written By:
  • Vicky
  • , Updated On : October 10, 2024 5:24 pm
    Follow us on

    Vishnu Priya : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో కెమెరాల ముందు నటించే మహానటులు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా ఆ జాబితాలో మణికంఠ, విష్ణు ప్రియ ని తీసుకోవచ్చు. మణికంఠ ని కాసేపు పక్కన పెడుదాం, ఇతనిది వేరే క్యాటగిరీ. కానీ విష్ణు ప్రియ గురించి మాత్రం ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఈమె వారం మొత్తం ఎపిసోడ్స్ లో ఒకలాగా, వీకెండ్ ఎపిసోడ్స్ లో మాత్రం మరొకలాగా అనిపిస్తూ ఉంటుంది. ఈమె వీకెండ్ ఎపిసోడ్ లో ఎలా ప్రవర్తిస్తుందంటే అసలు తనకి ఏమి తెలియదు అన్నట్టుగా, తింగరి మనిషి లాగా, విచిత్రమైన బాడీ లాంగ్వేజ్ తో చిన్న పిల్లలాగా మాట్లాడుతుంది. కానీ మిగతా ఎపిసోడ్స్ లో మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా సరైన పాయింట్స్ తో తనని తానూ డిఫెండ్ చేసుకోవడం లో కానీ, కౌంటర్లు ఇవ్వడంలో కానీ పెద్ద మనిషిలాగా వ్యవహరిస్తూ ఉంటుంది.

    ఇదంతా పక్కన పెడితే ఈమె రీసెంట్ గా స్మోకింగ్ జోన్ లో కూర్చొని సిగెరెట్ తాగుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. సిగరెట్ త్రాగడం లో వింతేమీ ఉంది, ఈరోజుల్లో అందరూ చేస్తున్న పనే కదా, విష్ణు ప్రియ చేస్తే తప్పేమి ఉంది అని ఆమె అభిమానులు అనుకోవచ్చు. కానీ విష్ణు ప్రియ తెలుగు అమ్మాయి అయ్యుండి ఇలా చేయడమే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. నార్త్ ఇండియాలో పుట్టి పెరిగిన వాళ్ళు ఇలా చేయడంలో వింతేమీ లేదు, ఎందుకంటే వాళ్లంతా అలాంటి వాతావరణంలో పుట్టి పెరిగారు కాబట్టి. కానీ విష్ణు ప్రియ అచ్చ తెలుగు అమ్మాయి అయ్యుండి, కోట్లాది మంది చూస్తున్న తెలుగు రియాలిటీ షోలో తనకి ఇలాంటి అలవాటు కూడా ఉందని చూపించుకుంది. ఎంతో అమాయకురాలిగా, ఏమి తెలియని అమ్మాయిగా కనిపించే విష్ణు ప్రియ కి ఇలాంటివి మాత్రం బాగా తెలుసా?, విష్ణు ప్రియ ఒరిజినల్ ఏమిటి?, రెగ్యులర్ ఎపిసోడ్స్ లో కనిపించే విష్ణు ప్రియనే ఒరిజినల్ అని అనుకోవాలా?, లేకపోతే వీకెండ్ ఎపిసోడ్స్ లో కనిపించే విష్ణు ప్రియని ఒరిజినల్ అనుకోవాలా?, అసలు ఈ అమ్మాయి తింగరిదా?, లేదా తెలివైన అమ్మాయా అనేది జనాలకు అర్థం కావడం లేదు. కానీ పలు సందర్భాలలో విష్ణు ప్రియ ని చూసిన తర్వాత అర్థమైనది ఏమిటంటే, ఈమె మంచి అమ్మాయి అని.

    తన ఎమోషన్స్ ని బాధ ని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటుంది అనేది కూడా అర్థం అయ్యింది. ఎందుకంటే ఈమెకు తల్లిదండ్రులు లేరు, కేవలం చెల్లి మాత్రమే ఉంది. తన జీవితం లో చాలా ట్రాజెడీ ఉంది, కానీ ఏనాడు కూడా ఆమె ఆ యాంగిల్ ని వాడుకొని సానుభూతి పొందాలనుకోలేదు. మొన్న తన చెల్లి నుండి లెటర్ వచ్చినప్పుడు కూడా చాలా వరకు తన ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవడం మనం గమనించాము. కానీ పైన చెప్పిన విధంగా విష్ణు ప్రియ గురించి ఆడియన్స్ లో ఒక స్పష్టమైన క్లారిటీ లేదు, అది కానీ ఉంటే ఆమె గ్రాఫ్ మరో లెవెల్ లో ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.