Prabhas Adipurush Budget: ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ వాయిదా పడడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ముందుగా ఈ సంక్రాంతికి రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల జూన్ 16న డేట్ ఫిక్స్ చేశారు. ‘ఆదిపురుష్’ టీజర్ విడుదలైనప్పటి నుంచి ఈ మూవీ నిత్యం వార్తల్లో నానుతోంది. ఈ సినిమా పాత్రలపై విమర్శలు రావడంతో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం సమయం తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో సినిమా బడ్జెట్ పెరగనుంది. అంటే వీఎఫ్ ఎక్స్ కోసం మరో రూ.100 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఇప్పుడు మరింత పెరిగిందనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఇటీవల రిలీజైన ‘బ్రహ్మస్త్ర’ను ‘ఆదిపురుష్’ బీట్ చేస్తుందని అంటున్నారు. ఇంతకీ ఆ వివరాలేంటో చూద్దాం.

బాహుబలి తరువాత ప్రభాస్ పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు. అయితే ‘సాహో’, ‘రాధేశ్యామ్’ భారీ బడ్జెట్ చిత్రాలే. కానీ అనుకున్న సక్సెస్ సాధించలేకపోయాయి. ఆధ్యాత్మిక సినిమాలకు డిమాండ్ ఏర్పడడంతో ప్రభాస్ తో ఓ మూవీ తీయాలనుకున్నాడు ఓం రౌత్. రామాయణంలోని కొన్ని ఘట్టాలను ఆధారంగా తీసుకొని ‘ఆదిపురుష్’ తీశారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకొని జనవరి 12న థియేటర్లోకి రావడానికి రెడీ అయింది. ఇందులో భాగంగా గత నెలలో టీజర్ ను రిలీజ్ చేశారు.
ఈ టీజర్ పై రకరకాల విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రాముడు, హనుమంతుడికి తోలు బెల్టులు పెట్టారని, రావణాసురుడికి కిరీటం లేవంటూ కొందరు విమర్శలు చేశారు. అయోధ్యలోని ప్రధాన పూజారి సైతం ఈ సినిమాపై విమర్శలు చేయడంతో సినిమాను నిలివేయాలన్న డిమాండ్ వచ్చింది. ఈ విమర్శల నేపథ్యంలో సినిమా పాత్రలను మార్చాలని నిర్ణయించింది సినీ బృందం. వీఎఫ్ఎక్స్ వర్క్ ను మార్చి పాత్రలను సెట్ చేయాలని అనుకున్నారు.

అయితే వీఎఫ్ఎక్స్ కోసం అదనంగా రూ.100 కోట్లు కేటాయించనున్నారట. ఇప్టపి వరకు సినిమా బడ్జెట్ రూ.450 కోట్లు. ఇప్పుడు అదనపు బడ్జెట్ కలిపితే రూ.550 కోట్లు అవుతుంది. ఇండియాలో ఇంత బడ్జెట్ పెట్టి తీసిన సినిమా లేదు. ఇటీవల రిలీజైన ‘బ్రహ్మస్త్ర’ ను రూ.500 కోట్లు కేటాయించారు. ఇప్పుడు ఆదిపురుష్ అంతకుమించి బడ్జెట్ కేటాయించడంతో రికార్డు సృష్టించనుంది. ఇంతవరకు బాగానే ఉన్నా దేశంలోని పలు భాషల్లో రిలీజ్ చేస్తేనే సినిమా పెట్టుబడులు వస్తాయి.. లేకుండా మొదటికే మోసం అవుతుందని కొందరు సినీ విశ్లేషకులు వాపోతున్నారు. అయితే రిలీజ్ తరువాత సినిమా ఎటువంటి టాక్ తెచ్చుుకుంటుందో చూడాలి..