Mahesh Babu: దర్శకుడు రాజమౌళి మిస్టర్ పర్ఫెక్ట్. తన సినిమాకు సంబంధించిన ప్రతి విషయం ఖచ్చితంగా ఉండాలి అనుకుంటారు. ముఖ్యంగా హీరోలను తన పాత్రకు తగ్గట్లు ఫిజికల్ గా ప్రిపేర్ చేస్తారు. బాహుబలి సినిమా కోసం ప్రభాస్, రానా ఎంత కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రభాస్ శివుడు పాత్రలో సన్నగా కనిపించాడు. అమరేంద్ర బాహుబలి లుక్ కోసం హెవీగా కండలు పెంచాడు. ఆర్ ఆర్ ఆర్ మూవీ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ లను రాజమౌళి అలానే తీర్చిదిద్దాడు. నిపుణుల పర్యవేక్షణలో వ్యాయామం చేయించారు.

రాజమౌళి తన నెక్స్ట్ హీరో మహేష్ ని కూడా ఇలానే సిద్ధం చేస్తున్నారు అనిపిస్తుంది. మహేష్ జిమ్ లో కఠిన వ్యాయామం చేస్తున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహేష్ వైఫ్ నమ్రత మహేష్ వర్క్ అవుట్స్ చేస్తున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. జిమ్ ట్రైనర్ పర్యవేక్షణలో మహేష్ హెవీ వర్క్ అవుట్స్ చేయడం మనం ఆ ఫొటోలో చూడొచ్చు. ఈ క్రమంలో త్వరలో ప్రారంభం కానున్న రాజమౌళి మూవీ కోసం ఆయన కండలు పెంచుతున్నాడన్న ప్రచారం మొదలైంది.
రాజమౌళి ఇప్పటికే మహేష్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. రాజమౌళి తన ప్రతి సినిమా జోనర్, కథ ఏమిటో ముందుగానే చెప్పేస్తాడు. మహేష్ మూవీ గురించి కూడా ఆయన ఒక ఐడియా ఇచ్చాడు. ఇది ప్రపంచాన్ని చుట్టే సాహసికుడు కథ అన్నారు. యాక్షన్ అండ్ అడ్వెంచర్ జోనర్లో మూవీ ఉంటుందని వెల్లడించడం జరిగింది. తన గత చిత్రాలకు మించి భారీ బడ్జెట్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. దీంతో మహేష్-రాజమౌళి మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

అదే సమయంలో మహేష్ ప్రిపరేషన్ త్రివిక్రమ్ మూవీ కోసం కూడా కావచ్చు అంటున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఎస్ఎస్ఎంబి 28 త్వరలో సెకండ్ షెడ్యూల్ కి వెళ్లనుంది. త్రివిక్రమ్ మహేష్ క్యారెక్టర్ సరికొత్తగా రూపొందించాడన్న వార్తలు వస్తున్నాయి. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ 2023 సమ్మర్ కానుకగా విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన చేశారు.
View this post on Instagram