OG movie release date: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేస్తూ వస్తున్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలకు మాత్రం చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. ఇప్పటికే ఆయన పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి ఏపీ డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్నప్పటికి ఆయన ఇంతకు ముందు కమిట్ అయిన సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇక మీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమా ఈనెల 24వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని చేపట్టే క్రమంలో సినిమా యూనిట్ చాలా బిజీగా ఉన్నారు. ఇక తొందర్లోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సినిమా తర్వాత సెప్టెంబర్ 25వ తేదీన సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో చేస్తున్న ఓజీ (OG) సినిమాని కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక దసర (Dasara) కానుకగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తోంది.
Also Read: చిరంజీవి చేసే చివరి సినిమా ఏంటో తెలుసా..?
తద్వారా పవన్ కళ్యాణ్ కి ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ నుంచి సినిమా వస్తే చాలు దాన్ని ఎలాగైనా సరే సక్సెస్ అయ్యేలా మేం చూసుకుంటాం అంటూ వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
మరి ఇలాంటి నేపథ్యంలో ఓజి సినిమాను అనుకున్న సమయానికి కనక రిలీజ్ చేసినట్టయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఈ సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగా సినిమాను సరైన సమయంలో దింపితే మాత్రం సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని సినిమా మేధావులు సైతం తెలియజేస్తున్నారు.
ఇక ఇప్పటికే సినిమా షూటింగ్ అయిపోయిన నేపద్యం లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా నిర్వహించే ప్రయత్నంలో సినిమా యూనిట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి సుజీత్ ఈ సినిమాని ఈసారైనా అనౌన్స్ చేసిన తేదీకి తీసుకొస్తాడా? ఇంకేదైనా ఏదైనా కారణం చెప్పి మరోసారి పోస్ట్ పోన్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది…