Nani: కెరియర్ మొదట్లో సాఫ్ట్ సినిమాలను చేస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించిన నాని ఈ మధ్యకాలంలో మాస్ సినిమాల వైపు ముగ్గు చూపిస్తున్నాడు. ‘దసర’ సినిమాతో స్టార్ హీరోగా మారిన ఆయన మాస్ లో సైతం విపరీతమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. దాంతో ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో తను ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇప్పటివరకు నాని చేసిన సినిమాలు అతనికి ఒక ఇమేజ్ ను తీసుకొస్తే ఇప్పుడు చేయబోతున్న సినిమాలతో అతను కంప్లీట్ మాస్ ప్రేక్షకులను అలరించబోతున్నాడు.
Also Read: విజయ్-త్రిషల ప్రేమకి ‘విక్రమ్-జ్యోతిక’లే కారణమా? ఆసక్తికరమైన కథనం!
‘ప్యారడైజ్’ సినిమా తనను టాప్ లెవెల్ కి తీసుకెళ్తుందనే ఉద్దేశ్యంతోనే ఆయన ఉన్నాడట. మరితను అనుకున్నట్టుగానే ఆ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది తద్వారా నాని ఇమేజ్ తారాస్థాయికి వెళ్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…ఈ సినిమా ఆగస్టు 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
అలాగే సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న ‘బ్లడీ రోమియో’ సినిమా సైతం ప్రేక్షకుల్లో విశేషమైన హైప్ క్రియేట్ చేసుకుంటుంది… బ్లడీ రొమియో సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పించబోతుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి నాని లాంటి హీరో ఎలాంటి పాత్రనైనా పోషించగలడు. తనలో ఆ వేరియేషన్స్ చూపించగలిగే క్వాలిటీ ఉంది. కాబట్టి చాలామంది దర్శకులు అతన్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు.
ఇక రాబోయే సినిమాలతో తను స్టార్ హీరోగా మారి టైర్ వాన్ హీరోగా పేరు తెచ్చుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ప్యారడైజ్, బ్లడీ రొమియో రెండు సినిమాలే అతని కెరియర్ ను డిసైడ్ చేయబోతున్నాయంటు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… ఈ రెండు సినిమాలతో భారీ సక్సెస్ లను సాధిస్తే తనకు తిరిగి ఉండదు. ఒకవేళ డీలా పడితే మాత్రం ఆయన క్లాస్ సినిమాల వైపే అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన టాప్ హీరోగా మారతాడా లేదా అనేది…