NTR: ఓడలు బండ్లు బండ్లు ఓడలు అవడం అంటే ఇదేనేమో. ఒకప్పుడు బాలీవుడ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉండేది. అక్కడి హీరోలకు ఇండియా వైడ్ మార్కెట్ ఉండేది. బాహుబలి పుణ్యమా అని పాన్ ఇండియా కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. సౌత్ స్టార్స్ సత్తా చాటుతున్నారు. ప్రభాస్, అల్లు అర్జున్, యష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి హీరోలు దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. తెలుగు, కన్నడ, తమిళ్ స్టార్ హీరోల సినిమాలు వందల కోట్లు అవలీలగా కొల్లగొతున్నాయి.
ఇటీవల ప్రభాస్ సలార్-షారుఖ్ ఖాన్ డుంకీ బాక్సాఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఫుల్ ఫార్మ్ లో ఉన్న షారుఖ్ ఖాన్ తో పోటీపడటం వలన ప్రభాస్ కే నష్టం అనుకున్నారు. రిజల్ట్ మాత్రం వేరుగా వచ్చింది. వసూళ్ల పరంగా సలార్ మూవీ డంకీ ని అధిగమించింది. చెప్పాలంటే సౌత్ ఇండియా హీరోలతో పోటీపడేందుకు బాలీవుడ్ స్టార్స్ భయపడే పరిస్థితి నెలకొంది. షారుఖ్, రన్బీర్ కపూర్ మినహాయిస్తే ఎవరు బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపడం లేదు.
షారుఖ్ పదేళ్లకు పైగా హిట్ కోసం స్ట్రగుల్ అయ్యాడు. పఠాన్, జవాన్ చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఇక అక్షయ్ కుమార్, అమిర్ ఖాన్, హృతిక్, సల్మాన్ వంటి స్టార్స్ స్ట్రగుల్ అవుతున్నారు. ముఖ్యంగా అక్షయ్ కుమార్ సినిమాలకు కనీస ఆదరణ దక్కడం లేదు. టైగర్ ష్రాఫ్ పరిస్థితి మరీ దారుణం. ఈ క్రమంలో వీరిద్దరి కాంబోలో ‘చోటే మియా బడే మియా’ చిత్రం తెరకెక్కింది. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన చోటే మియా బడే మియా ఏప్రిల్ 10న విడుదల చేయాలనేది ప్లాన్.
ఈ క్రమంలో ఎన్టీఆర్ దేవరతో చోటే మియా బడే మియా పోటీపడనుంది. దేవర ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కాగా జనవరి 8న విడుదలైన దేవర ఫస్ట్ గ్లింప్స్ చూసిన చోటే మియా బడే మియా మేకర్స్ సందిగ్ధంలో పడ్డారట. దేవరకు ఎదురెళితే నష్టపోతామేమో అనే భయం వ్యక్తం చేస్తున్నారట. ఈ మేరకు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి ఎన్టీఆర్ తో అక్షయ్ కుమార్, టైగర్ పోటీపడతారా లేక వెనక్కి తగ్గుతారా?