Sukumar: ఆ ఒక్క విషయం లో సుకుమార్ ఇప్పటికి బాధపడుతున్నాడా..?

వన్ సినిమా ఇప్పుడు చూస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రేక్షకులు మైండ్ సెట్ ని బట్టి దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. అందువల్లే ఆ సినిమా ప్లాప్ అయింది అంటూ సోషల్ మీడియాలో సుకుమార్ అభిమానులు పెద్ద ఎత్తున సుకుమారికి సపోర్టుగా మాట్లాడుతున్నారు.

Written By: Gopi, Updated On : January 9, 2024 12:37 pm

Sukumar

Follow us on

Sukumar: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన సుకుమార్ డిఫరెంట్ కథ తో సినిమాలు చేసి మంచి సక్సెస్ కొట్టడంలో నిపుణుడు అనే చెప్పాలి. ఇక ఈ క్రమంలో ఈయన చేసిన వన్ నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయినందుకు ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే తను ఆలోచించినట్టు గా జనాలు ఆలోచించలేకపోయారని దానివల్ల ఆ సినిమా ఫ్లాప్ అయిందంటూ బాధపడుతూ ఉంటాడు…

అందుకే ఈ సినిమా రిలీజ్ అయి ప్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత సుకుమార్ జనాల మీద చాలా కోపంతో మాట్లాడాడు ప్రేక్షకులకి తన సినిమా చూసేంత నాలెడ్జ్ లేదని కామెంట్స్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా ఆ సినిమా ప్లాప్ మీద రిగ్రెట్ అవుతూ ఉంటాడు. ఇక రీసెంట్ గా కూడా ఈ సినిమా మీద స్పందించిన సుకుమార్ అంత మంచి సినిమాని నేను తీసిన కూడా జనాలు ఎందుకు ఆక్సెప్ట్ చేయలేదో నాకు అర్థం కావట్లేదు అంటూ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు. ఇక ఇప్పటికీ ఆయనకు చిన్న అసంతృప్తి ఏదైనా ఉంది అంటే అది వన్ నేనొక్కడినే సినిమా మీద తను పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము అవ్వడమే దాసం తృప్తి అంటూ చెప్పాడు. తను ఎన్ని సినిమాలను సక్సెస్ ఫుల్ గా తీసిన కూడా తనకు బాగా నచ్చిన వన్ సినిమా ఫ్లాప్ అవడం అనేది తన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేనని ఎందుకంటే సినిమాని తీసేటప్పుడు గాని సినిమా రిలీజ్ టైం లో గాని ఆ సినిమా భారీ హిట్ అవుతుందని తను అంచనా వేసినట్టుగా కూడా తెలియజేశాడు.

నిజానికి వన్ సినిమా ఇప్పుడు చూస్తే చాలా బాగుంటుంది. అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ప్రేక్షకులు మైండ్ సెట్ ని బట్టి దాన్ని వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోయారు. అందువల్లే ఆ సినిమా ప్లాప్ అయింది అంటూ సోషల్ మీడియాలో సుకుమార్ అభిమానులు పెద్ద ఎత్తున సుకుమారికి సపోర్టుగా మాట్లాడుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలో సుకుమార్ చేసిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను అలరించడం లో ఎప్పుడు ముందుంటుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఇక ఇప్పుడు ఈయన అల్లు అర్జున్ తో పుష్ప 2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కనక సూపర్ సక్సెస్ అయితే సుకుమార్ పేరు పాన్ ఇండియా రేంజ్ లో మరోసారి భారీ స్థాయిలో వినిపిస్తుంది అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశక్తి లేదు. ఇక ఆయనతోపాటు సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు అందరూ క్యూ కడుతున్నారు…