Bigg Boss 9 Telugu: టెలివిజన్ రంగంలో భారీ గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక రియాల్టీ షో బిగ్ బాస్… ప్రస్తుతం 8 సీజన్లను పూర్తిచేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ ను చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశారు. ఇప్పటికే 15 రోజులు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు బిగ్ బాస్ సీజన్ 9 నుంచి ఒక ఎలిమినేషన్ మాత్రమే జరిగింది. ఇక ఈ రోజు రెండోవ ఎలిమినేషన్ కూడా జరగబోతోంది. నిజానికి బిగ్ బాస్ లో కాంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ ఎవరు చేస్తారు అంటే..కంటెస్టెంట్స్ కి జనాల నుంచి వచ్చే ఓట్లును బట్టి, వాళ్ళు హౌజ్ లో ఉంటున్న విధానాన్ని బట్టి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తారనే విషయమైతే మనందరికి తెలుసు… ఇక ఈ షో కి హోస్ట్ గా చేస్తున్న నాగార్జున ను సైతం ఎలిమినేషన్ లో భాగం చేసి అతని ఒపీనియన్ ను కూడా తెలుసుకొని ఎవరినైతే ఎలిమినేట్ చేయాలో వారిని మాత్రమే ఎలిమినేట్ చేయడానికి షో యాజమాన్యం సన్నాహాలైతే చేస్తారట. మరి ఇప్పటివరకు నాగార్జున హోస్ట్ గానే చేస్తున్నారని అందరు అనుకున్నప్పటికి ఈ ఎలిమినేషన్ లో నాగార్జున కీలకపాత్ర పోషిస్తాడనే విషయం చాలామందికి తెలియదు. మొత్తానికైతే నాగార్జున ఈ షో టిఆర్పి రేటింగ్ ను పెంచడానికి తను కూడా చాలావరకు ప్రయత్నం చేస్తాడని తెలుస్తోంది.
ఎలిమినేషన్ కి నాగార్జున ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అని అనుకోవచ్చు. ఆయన హోస్ట్ గా చేస్తున్నాడు కాబట్టి అలాగే టీమ్ మెంబర్స్ ను కంట్రోల్ చేస్తున్నాడు కాబట్టి అతన్ని భాగం చేస్తున్నారట…ఇక ఈ ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఎవరికైతే ఎక్కువ క్రేజ్ ఉంటుందో వాళ్లను బిగ్ బాస్ హౌస్ లోనే ఉంచి, మిగతా వాళ్లను మాత్రమే ఎలిమినేట్ చేస్తారు.
అంటే శివ మంచి పాపులారిటీ ని సంపాదించుకున్న వారిని షో నుంచి బయటకు పంపించరు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు వాళ్ళ కాంటెస్టెంట్ లేడని ఈ షోను చూడటం మానేస్తారు. కాబట్టి కొంచెం పాపులారిటీ ఉన్న కంటెస్టెంట్స్ టాస్కులను సరిగ్గా ఆడకపోయిన వాళ్లను కొన్ని వారాలపాటు షో లోనే కొనసాగించే విధంగా సన్నాహాలైతే చేస్తారు…
ఇక ఈ షో అంతా స్క్రిప్టెడ్ అంటు కొంతమంది కామెంట్స్ చేస్తుంటే మరో కొంత మంది మాత్రం స్క్రిప్ట్ కాదు కానీ వాళ్ళందరిని ఒక పనిలో ఇన్వాల్వ్ చేయడం వల్ల వాళ్ళల్లో వాళ్ళకే పడక గొడవలు పెట్టుకుంటున్నారు. అంతే తప్ప ఇందులో స్క్రిప్ట్ చేయడానికి ఏది లేదని చెబుతుంటారు. మరి ఏది ఏమైనా కూడా ఈ షో తెలుగులో మంచి పాపులారిటి ని సంపాదించుకొని హైయెస్ట్ టీఆర్పి రేటింగ్ తో ముందుకు తీసుకెళ్లడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి…