https://oktelugu.com/

Mrunal Thakur: ఇప్పుడైనా బాలీవుడ్ లో మృణాల్ కి సక్సెస్ దక్కుతుందా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఇండియా లోనే టాప్ ఇండస్ట్రీ గా గుర్తింపు పొందింది...ఇక మొత్తానికైతే ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా లో భారీ సక్సెస్ లను సాధిస్తున్నారు...

Written By:
  • Gopi
  • , Updated On : August 7, 2024 / 09:33 AM IST

    Mrunal Thakur

    Follow us on

    Mrunal Thakur: బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటీమణులు చాలామంది ఉన్నారు. కొంతమంది ముందుగా సౌత్ లో బాగా పాపులారిటీని సంపాదించుకున్న తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ విజయాలు సాధించి టాప్ హీరోయిన్లుగా ఎదిగారు… ఇక మృణాల్ ఠాకూర్ లాంటి హీరోయిన్ మొదట బాలీవుడ్లో ఒకటి, రెండు సినిమాలు చేసినప్పటికీ ఆమెకు అక్కడ పెద్దగా గుర్తింపైతే రాలేదు. ఇక దాంతో హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ‘సీతా రామం’ సినిమా తెలుగులో మంచి విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో ఆమె ఒక్కసారిగా టాప్ హీరోయిన్ గా మారిపోయింది. దాంతో ఆమెకు తెలుగులో మంచి అవకాశాలైతే వచ్చాయి…ఈ సినిమా తర్వాత నాని హీరోగా వచ్చిన ‘హాయ్ నాన్న’ అనే సినిమా చేసి మరొక సక్సెస్ ని తన ఖాతాలో వేసుకుంది. ఈ రెండు సినిమాల తర్వాత మూడోవ సినిమాగా వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో ఉందనే చెప్పాలి. దీంతో ఆమెకి ఇప్పుడు బాలీవుడ్ లో మంచి అవకాశాలైతే వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగన్ తో ‘సన్నాఫ్ సర్దార్ 2’ సినిమాలో నటిస్తుంది. నిజానికి ఈ సినిమా మొదటి పార్టు 2012 లో రిలీజ్ అయింది.

    ఇక ఈ సినిమా తెలుగులో రాజమౌళి డైరెక్షన్ లో సునీల్ హీరోగా వచ్చిన ‘మర్యాద రామన్న’ కు రీమేక్ వచ్చింది. ఇక దాదాపు మళ్లీ 12 సంవత్సరాల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ చేస్తున్నారు… ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ సినిమా రీసెంట్ గా యూకే లో స్టార్ట్ అయినట్టుగా అజయ్ దేవగన్ తెలియజేశారు. ఇక ట్విట్టర్ వేదికగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోని కూడా తను షేర్ చేశాడు.

    ఇక ఈ వీడియోలో అజయ్ దేవగన్ గురుద్వార్ నుంచి బయటకు వస్తుంటే పక్కనే పంజాబీ సూట్ వేసుకొని డోల్ వాయిస్తున్న మృణాల్ కనిపించింది. ఇక మొత్తానికైతే ఈ సినిమా తనని బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నిలబెడుతుంది అంటూ మృణాల్ ఠాకూర్ ఒక మంచి నమ్మకంతో అయితే ఉంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమా బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ అయి మృణాల్ ఠాకూర్ కి మంచి గుర్తింపును తీసుకువస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…

    ఇక ఆమెకి ఇప్పుడు తెలుగులో కూడా మంచి అవకాశాలైతే వస్తున్నాయి. ఇక రీసెంట్ గా ప్రభాస్ హీరోగా వచ్చిన కల్కి సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించింది. ఇక ఆ సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇప్పుడు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి హీరో సినిమాలతో నటించడానికి సిద్ధమవుతుంది. కంటెంట్ బాగుంటే ఎలాంటి పాత్రలో అయిన నటించడానికి తను ఎప్పుడు సిద్ధంగా ఉంటానని ఆమె తెలియజేయడం విశేషం… ఇక మొత్తానికైతే తొందర్లోనే మృణాల్ ఠాకూర్ ఇండియాలోనే ఒక స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…