Mana Shankara Varaprasad Garu Nizam Collections: ఈ సంక్రాంతికి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపిస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం ఇప్పుడు చిక్కుల్లో పడింది. ఈ సినిమాకు ప్రభుత్వం చట్టవిరుద్ధంగా టికెట్ రేట్స్ పెంచుకోవడానికి జీవో ని ఇచ్చిందని, ప్రీమియర్ షోస్ కి హై కోర్టు అనుమతి ఇవ్వకపోయినా కూడా అక్రమంగా ఒక్కో టికెట్ ని 600 రూపాయలకు అమ్మారని, అంతే కాకుండా అక్రమంగా రెగ్యులర్ షోస్ కి కూడా టికెట్ రేట్స్ పెంచి సువారుగా 45 కోట్ల రూపాయిల వరకు అక్రమంగా లాభాలను అందుకున్నారని, ఆ డబ్బులు మొత్తం హై కోర్టు స్వాధీనం చేసుకోవాలంటూ నిన్న హై కోర్టులో పిటీషన్ దాఖలు అయ్యాయి. ఈ పిటీషన్ ని స్వీకరించిన హై కోర్టు , GST అధికారులను ఈ సినిమా సాధించిన వసూళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
నిర్మాతలు ప్రభుత్వానికి జీఎస్టీ మరియు ఇతర టాస్కులు కట్టి ఉండుంటే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ కట్టకపోతే మాత్రం చాలా పెద్ద పరిణామాలను ఎదురుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ లో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాని బ్యాన్ చేయొచ్చు, ఈ చిత్రం ద్వారా ఆ ప్రాంతం నుండి వసూలైన కలెక్షన్స్ మొత్తాన్ని సీజ్ చేయొచ్చు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అదే కనుక జరిగితే నిర్మాతలకు కోలుకోలేని షాక్ అనే చెప్పాలి. ‘మన శంకర వరప్రసాద్ గారు’ లాంటి సూపర్ హిట్ చిత్రాలు చాలా అరుదుగా ఇండస్ట్రీ కి దొరుకుతుంటాయి. ఈ సినిమాని కొనుగోలు చేసిన ప్రతీ బయ్యర్ సేఫ్ అయ్యాడు. రూపాయికి పది రూపాయిల లాభం కలిసొచ్చింది. అలాంటి సమయం లో సంపూర్ణంగా సక్సెస్ ని ఎంజాయ్ చేసే అవకాశం నిర్మాతలకు లేకపోతే చాలా బాధగా ఉంటుంది అనుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి.
ఇకపోతే రీసెంట్ గానే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్ రేట్స్ మామూలు రేంజ్ కి వచ్చేసాయి. దీంతో బుక్ మై షో లో టికెట్ సేల్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఊపు చూస్తుంటే ఈ చిత్రానికి మరో రెండు వారాల థియేట్రికల్ రన్ కచ్చితంగా వచ్చేలా ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ వీకెండ్ + రేపుబిక్ డే హాలిడే ఈ చిత్రానికి చాలా కీలకం కానుంది. ఈ మూడు రోజులు మంచి థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటే ఫుల్ రన్ లో ఈ చిత్రం 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉంటాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు , చూడాలి మరి అంత వరకు వెళ్తుందా లేదా అనేది.