https://oktelugu.com/

బెడిసి కొడుతున్న కేసీఆర్ ప్లాన్.. వరద సాయం టీఆర్ఎస్ ను ముంచనుందా?

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ పార్టీకి ఎదురుల్లేకుండా పోయింది. రాష్ట్రంలో ఏ ఎన్నిక చూసినా వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ కు ధీటుగా ప్రతిపక్ష పార్టీలు పోటీ ఇచ్చిన సందర్భాల్లేవ్.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్ కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందనే విమర్శలున్నాయి. కరోనా సమయంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : October 31, 2020 / 01:35 PM IST
    Follow us on

    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ పార్టీకి ఎదురుల్లేకుండా పోయింది. రాష్ట్రంలో ఏ ఎన్నిక చూసినా వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగింది. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ కు ధీటుగా ప్రతిపక్ష పార్టీలు పోటీ ఇచ్చిన సందర్భాల్లేవ్.. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    కరోనా కట్టడిలో టీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందిందనే విమర్శలున్నాయి. కరోనా సమయంలో తొలినాళ్లలో కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి హడావుడి చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు ఆయన మీడియాకు కన్పించకుండా పోయారు. దీంతో పలువురు ఆయన కన్పించడం లేదని కోర్టుకు కూడా వెళ్లారు. అదేవిధంగా సీఎం అధికారిక నివాసంలోనే కరోనా సోకడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.

    కొత్త సచివాలయం నిర్మాణంలో వివాదం.. మిడతుల దండు.. అకాల వర్షాలు.. వరదలు.. చెరువులకు గండ్లుపడి ఊళ్లన్నీ జలమయం కావడం వంటి సమస్యలు కేసీఆర్ సర్కారుకు కొత్త ఇబ్బందులు తెచ్చిపెట్టాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరంగల్.. హైదరాబాద్ నగరాలు వరదల్లో మునిగిపోవడానికి సర్కార్ వైఫల్యమే కారణమే విమర్శలు పెద్దఎత్తున వచ్చాయి. ప్రతిపక్షాలు సైతం సర్కార్ వైఫల్యాలను ఎండగట్టి తెలంగాణలో మళ్లీ మైలేజ్ పెంచుకున్నాయి.

    Also Read: స్కూళ్ల ప్రారంభం: విద్యార్థులకు కరోనా భయం?

    టీఆర్ఎస్ సర్కారుపై పెద్దఎత్తున విమర్శలు.. వ్యతిరేకత రావడంతో వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ భారీ ఎత్తున సాయం ప్రకటించారు. హైదరాబాద్లో ఒక్కో కుటుంబానికి పదివేల సాయం ప్రకటించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజల్లో వ్యతిరేకత రాకుండా కేసీఆర్ సాయం ప్రకటించారు. అయితే టీఆర్ఎస్ నేతల కక్కుర్తితో ఈ ప్లాన్ బెడిసి కొట్టినట్లు స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

    వీలైనంత త్వరగా బాధితులకు సాయమందించేందుకు ప్రభుత్వం స్థానిక టీఆర్ఎస్ నేతలను రంగంలోకి దింపింది. అయితే టీఆర్ఎస్ నేతలు సాయానికి గండికొడుతుండటంతో బాధితుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కాలనీల్లో కేవలం పది మంది టీఆర్ఎస్ సానుభూతి పరులకే మాత్రం సాయం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగతా 90శాతం కుటుంబాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తోంది.

    Also Read: ఏపీ రాజకీయం.. ‘ఫ్యాన్’ గాలికి సేదతీరుతున్న సీపీఎం..!

    ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వరద సాయాన్ని నిలిపివేసినట్లు తెలుస్తోంది. పక్కాగా సమాచారం సేకరించి బాధితులకు సాయం అందించనున్నట్లు ప్రకటించింది. జీహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సర్కారు ప్రజలకు వరదసాయం అందించి మైలేజీ పొందాలని భావించగా నేతల తీరుతో అసలుకే మోసం వచ్చేలా కన్పిస్తోంది. ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత వస్తుండటంతో టీఆర్ఎస్ కు గ్రేటర్ ఎన్నికల్లో ఓట్లలో భారీగా గండిపడటం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.