Homeక్రీడలుIndia Vs Sri Lanka Final: ఆసియా కప్; సిరాజ్ "సిక్సర్": శ్రీలంక 39/7

India Vs Sri Lanka Final: ఆసియా కప్; సిరాజ్ “సిక్సర్”: శ్రీలంక 39/7

India Vs Sri Lanka Final: ఆసియా ఫైనల్ మ్యాచ్.. టాస్ గెలిచిన లంక కెప్టెన్ శనక మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానం మీద తేమ ఉంది కాబట్టి, ఆడుతోంది సొంతమైదానం కాబట్టి భారీగా పరుగులు సాధించవచ్చు అని శనక అనుకుని ఉంటాడు..కానీ తన నిర్ణయం ఎంత తప్పో ఆ తర్వాత గాని అతడికి అర్థమయి ఉండదు. తొలి ఓవర్ వేసిన బుమ్రా 0.3 వద్ద కుషాల్ ఫెరీరా ను ఔట్ చేశాడు. బుమ్రా వేసిన ఇన్ సైడ్ స్వింగర్ ను తప్పుగా అర్థం చేసుకున్న ఫెరీరా.. బ్యాట్ ను ఝళిపించబోయాడు. అది అంచుకు తాకి కీపర్ రాహుల్ చేతిలో పడింది. దీంతో శ్రీలంక 1 పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత సిరాజ్ అందుకున్నాడు.

మైదానం అసలే తేమగా ఉండటంతో నిప్పులు చెరిగే విధంగా బంతులు వేశాడు. అతడి బంతుల ధాటికి లంక ఆటగాళ్లు బెంబేలెత్తిపోయారు. కనీసం బ్యాట్ ను ఊపేందుకు కూడా ధైర్యం చేయలేకపోయారు. తను వేసిన రెండవ ఓవర్ తొలి బంతికి సిరాజ్.. అత్యంత ప్రమాదకరమైన ఓపెనర్ నిషాంక ను ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతిని షాట్ ఆడబోయి రవీంద్ర జడేజాకు చిక్కాడు. ఎప్పుడైతే ఈ వికెట్ పడగొట్టాడో.. అప్పటినుంచి సిరాజ్ మాయాజాలం మొదలైంది. ఆ తర్వాత వేసిన మూడవ బంతికి సధీర సమర విక్రమను సిరాజ్ ఔట్ చేశాడు. లో హైట్ లో వచ్చిన బత్తిని తప్పుగా అర్థం చేసుకున్న సమర విక్రమ.. వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి శ్రీలంక స్కోరు 3.3 ఓవర్లకు 8 పరుగులు. ఆ తర్వాత బంతికే చరిత అసలంకనూ సిరాజ్ బలిగొన్నాడు. సిరాజన్ వేసిన బంతిని భారీ షాట్ ఆడబోయి ఇషాన్ కిషన్ కు దొరికిపోయాడు. ఇలా ఒక ఓవర్లో సిరాజ్ మూడు కీలకమైన వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బతీశాడు. అదే ఓవర్ చివరి బంతికి ధనుంజయ డిసిల్వా ను ఔట్ చేశాడు. సిరాజ్ వేసిన బంతి ధనుంజయ బ్యాట్ చివరి అంచును తాకి కీపర్ రాహుల్ చేతిలో పడింది.

ఆ మరుసటి ఓవర్ వేసిన బుమ్రా మేడిన్ ముగించాడు. బంతి అందుకున్న సిరాజ్ మరింత పదునైన బంతులు వేశాడు. ఐదో ఓవర్ నాలుగో బంతికి కెప్టెన్ దాసున్ శనక ను ఔట్ చేశాడు. తక్కువ ఎత్తులో బంతివేసి అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. 11.2 ఓవర్ వద్ద కుషాల్ మెండీస్(17) ను కూడా క్లీన్ బౌల్డ్ చేశాడు. ఫలితంగా సిరాజ్ దెబ్బకు శ్రీలంక సగం బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరుకున్నారు. ఔట్ అయిన వారిలో ముగ్గురు బ్యాట్స్ మెన్ ఖాతా తెరవకపోవడం విశేషం. ఈ కథనం రాసే సమయానికి 11.4 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 39 పరుగులు చేసింది. హేమంత(5), వెల్లాలగే(8) క్రీజు లో ఉన్నారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version