https://oktelugu.com/

Vishwam Movie Teaser : విశ్వం టీజర్ ఒకే.. ఈ సినిమాతో గోపీచంద్ కి హిట్ వస్తుందా..? శ్రీను వైట్ల మళ్లీ రాణిస్తాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోలు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవాలని చూస్తున్నారు...ఇక ఇలాంటి క్రమం లోనే గోపి చంద్ లాంటి స్టార్ హీరో కూడా టైర్ వన్ హీరోగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకు ఎలాంటి సక్సెస్ లు దక్కడం లేదు. దానివల్ల ఆయన మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోతున్నాడు...

Written By:
  • Vicky
  • , Updated On : September 3, 2024 / 07:17 PM IST

    Vishwam Movie Teaser

    Follow us on

    Vishwam Movie Teaser : గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వం లో వస్తున్న ‘విశ్వం’ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలైతే లేవు. ఎందుకంటే శ్రీనువైట్ల గతంలో చేసిన సినిమాలన్నీ భారీ ఫ్లాపులుగా నిలిచాయి. ఇక గోపిచంద్ ఇంతకుముందు చేసిన సినిమాలు ఏవి పెద్దగా ఆడకపోవడంతో ఫ్లాప్ డైరెక్టర్, ఫ్లాప్ హీరో ఇద్దరు కలిసి చేస్తున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలైతే లేవు. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు.ఈ టీజర్ లో కామెడీ, యాక్షన్ ఎపిసోడ్స్ ని హైలైట్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేశారు. ఈ సినిమాతో అటు గోపీచంద్, ఇటు శ్రీనువైట్ల ఇద్దరు మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమా వాళ్లకి మంచి విజయాన్ని కట్టబెడుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి టీజర్ లో మాత్రం ఇంతకు ముందు శ్రీను వైట్ల మార్క్ కామెడీ అంత హైలెట్ అవ్వకపోగా, ఎమోషన్స్ యాక్షన్స్ తో మాత్రం మేకర్స్ ఆడియెన్స్ ను ఒక మూడు లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. ఇక సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.

    ఇక గతంలో శ్రీను వైట్ల స్టార్ హీరోలందరితో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఆయన తన పూర్తి ఫామ్ ను అందుకోలేకపోతున్నాడు. ఏ సినిమా చేసినా కూడా ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే తప్ప తనకి పెద్ద హీరోల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలైతే లేవు.

    కాబట్టి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకంగా మారిపోతున్నట్టుగా తెలుస్తుంది. శ్రీను వైట్లను ఎవ్వరూ నమ్మకపోతే గోపీచంద్ నమ్మి తనకు సినిమాని ఇచ్చాడు. ఈ సమయంలో అటు గోపీచంద్ కి మంచి సక్సెస్ ని ఇవ్వడం ఎంత ముఖ్యమో తనను తాను డైరెక్టర్ గా కూడా నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం…

    కాబట్టి ఎలాగైనా సరే ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ను దక్కించుకోవాల్సిన అవసరమైతే ఉంది… శ్రీను వైట్ల తన పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే మాత్రం ఈ ఒక్క అడుగుని అధిగమిస్తే తనకు మంచి లైఫ్ అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం ఇక శ్రీను వైట్ల షెడ్డు కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది…