Globetrotter event: కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన మహేష్ బాబు(Superstar Mahesh Babu), రాజమౌళి(SS Rajamouli) #Globetrotter ఈవెంట్ కాసేపట్లో రామోజీ ఫిలిం సిటీ లో గ్రాండ్ గా ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్ జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రానికి ‘వారణాసి'(Varanasi Movie) అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం లో నటిస్తున్న పృథ్వీ రాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్స్ విడుదలై మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు మహేష్ బాబు ఫస్ట్ లుక్ తో పాటు, ఈ సినిమాకు సంబంధించిన మూడు నిమిషాల గ్లింప్స్ వీడియో ని కూడా నేడు విడుదల చేయబోతున్నారు. ఈమధ్యనే విడుదల చేసిన ‘సంచారి’ థీమ్ సాంగ్ ఎలా ఉన్నిందో మీరంతా చూసే ఉంటారు. ఈరోజు విడుదల చేయబోయే కంటెంట్ అంతకు వంద రెట్లు గొప్పగా ఉంటుందని టాక్.
ఇప్పటికే అభిమానులు వేల సంఖ్యలో రామోజీ ఫిలిం సిటీ కి చేరుకున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ కి ఇప్పుడు రెండు పెద్ద టార్గెట్స్ ఉన్నాయి. అవి పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’, అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’. ఓజీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని యూట్యూబ్ లో దాదాపుగా 7 లక్షలకు పైగా ఆడియన్స్ లైవ్ లో వీక్షించారు. కేవలం ఒకే ఒక్క యూట్యూబ్ ఛానల్ నుండి దాదాపుగా 2 లక్షల 81 వేల మంది వీక్షించారు. దీనిని ఆల్ టైం ఇండియన్ రికార్డు గా పరిగణించొచ్చు. అదే విధంగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని అన్ని యూట్యూబ్ చానెల్స్ కి కలిపి 6 లక్షల మంది లైవ్ గా చూసారు. కేవలం సింగల్ ఛానల్ నుండి ఈ ఈవెంట్ కి 2 లక్షల 70 వేల వ్యూస్ వచ్చాయి.
ఈ రెండు రికార్డ్స్ ని #Globetrotter ఈవెంట్ బద్దలు కొట్టగలదా?, అంత సత్తా ఉందా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. అయితే హాట్ స్టార్ లో ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ యూజర్లు ఉన్నారు. అంటే దాదాపుగా 100 కోట్ల మంది అన్నమాట. సాధారణమైన ఈవెంట్స్ కి కూడా ఇందులో మూడు లక్షల మంది లైవ్ వ్యూయర్స్ చూస్తుంటారు. అలాంటిది ఇంత పెద్ద ఈవెంట్ ని కనీసం 20 లక్షల మంది అయినా లైవ్ లో చూస్తారని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. ఇది ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి. ఒకవేళ అంతమంది ఈ ఈవెంట్ ని చూస్తే మాత్రం, టాలీవుడ్ లో అన్ బీటబుల్ రికార్డుగా ఈ ఈవెంట్ చరిత్రలో నిలిచిపోతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు.