Peddi Movie Latest Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం పై అభిమానులు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ప్రారంభం కచ్చితంగా కుంభస్థలం బద్దలు కొట్టబోతోంది అనే రేంజ్ అంచనాలతో విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. దీంతో ఫ్యాన్స్ రామ్ చరణ్ కి బాగా అచ్చొచ్చిన రూరల్ బ్యాక్ డ్రాప్ లో పెద్ది సినిమా చేస్తున్నాడు అనే వార్త వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది. దానికి తోడు పెద్ది మొదటి గ్లింప్స్ వీడియో కి, అదే విధంగా రెండు రోజుల క్రితం విడుదలైన ‘చికిరి చికిరి’ పాట పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో ఈ సినిమా పై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి. అయితే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా తీసుకోగలరో అంటూ సోషల్ మీడియా లో విస్లషేకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే రామ్ చరణ్ సెకండ్ హాఫ్ మధ్య లో నుండి కాళ్ళు లేని వాడిగా కనిపిస్తాడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త. ఒక పెద్ద సూపర్ స్టార్ అయ్యుండి ఇలాంటి పాత్రలు చేయడానికి దమ్ముండాలి. అసలు స్టార్ హీరోలు దగ్గర్లోకి కూడా వెళ్లారు. ఈ చిత్రం కథ ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తో చేయించాలని ప్రయత్నం చేసారు. కానీ ఎన్టీఆర్ ఇలాంటి కథల్లో అభిమానులు నన్ను చూడలేరని ఆయన సున్నితంగా రిజెక్ట్ చేసాడట . ఇక ఆ తర్వాత రామ్ చరణ్ వద్దకు ఈ కథ వెళ్లడం, ఆయనకు విపరీతంగా నచ్చి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27 న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కానుంది. మరి రామ్ చరణ్ ఈ చిత్రం తో కం బ్యాక్ ఇస్తాడా లేదా అనేది చూడాలి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.