https://oktelugu.com/

దిశ’ మూవీ కూడా ‘మర్డర్’ అవుతుందా?

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. తెలంగాణలో ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే..! దీని ఆధారంగానే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి ఫస్ట్ లుక్.. ట్రైలర్ విడుదలై చర్చనీయాంశంగా మారాయి. Also Read: ఇప్పుడెలా? మహేష్ బాబు ప్లాన్ బెడిసికొట్టిందా? దిశ ఎన్ కౌంటర్ మూవీపై బాధితురాలు తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శనివారం ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : October 11, 2020 / 11:32 AM IST
    Follow us on

    సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దిశ ఎన్ కౌంటర్’. తెలంగాణలో ‘దిశ’ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే..! దీని ఆధారంగానే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని చేస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీకి ఫస్ట్ లుక్.. ట్రైలర్ విడుదలై చర్చనీయాంశంగా మారాయి.

    Also Read: ఇప్పుడెలా? మహేష్ బాబు ప్లాన్ బెడిసికొట్టిందా?

    దిశ ఎన్ కౌంటర్ మూవీపై బాధితురాలు తండ్రి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. శనివారం ఆయన మీడియా ముందుకొచ్చాడు. ఈమేరకు ఆయన మాట్లాడుతూ దర్శకుడు రాంగోపాల్ వర్మ తమను సంప్రదించకుండానే ఈ మూవీ చేస్తున్నట్లు వాపోయాడు. తాము కుమార్తె కొల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే తమను మరింత బాధపెట్టడం భావ్యంకాదని ఆవేదన వెలిబుచ్చాడు.

    రాంగోపాల్ తమను సంప్రదించకుండా దిశ ఉదాంతంపై సినిమా తీయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాడు. డబ్బుల కోసమే వర్మ ఈ సినిమా తీస్తున్నాడన్నారు. ఈ సినిమా ట్రైలర్ కింద ఉన్న కామెంట్లు తమను మరింత బాధకు గురిచేస్తున్నాయన్నారు. ఈ సినిమాను బ్యాన్ చేసేలా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

    ఇదిలా ఉంటే.. ‘దిశ ఎన్ కౌంటర్’ ట్రైలర్ చూస్తుంటే రాంగోపాల్ వర్మను ఈ ఉదాంతాన్ని కట్టకుకట్టినట్టు చూపించినట్లు కన్పిస్తోంది. రాంగోపాల్ వర్మ ‘దిశ’ సంఘటనపై గతంలో మాట్లాడుతూ దిశ ఇన్స్ డెంట్ ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు చెప్పాడు. ఈ సినిమా చూశాక మృగాళ్లు.. అమ్మాయిలు చూస్తేనే భయపడేలా ఉంటుందని ప్రకటించాడు.

    Also Read: ఆ ఒక్క సినిమా చేసి రాజమౌళి రిటైర్ అవుతాడా?

    కాగా దిశ తండ్రి అభ్యంతరాల నేపథ్యంతో ‘దిశ’ మూవీ కూడా మర్డర్ అవుతుందా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎవరినీ అంతగా లెక్కచేయకుండా తనపని తాను చేసుకుపోయే రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్ కౌంటర్’ మూవీని తన యూట్యూబ్లో విడుదల చేయడం ఖాయమని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.