https://oktelugu.com/

Hema Malini: ధర్మేంద్ర కుటుంబం ఎట్టకేలకు కలవబోతుందా..? హేమ మాలిని మాటల ఆంతర్యం!

ధర్మేంద్ర కుటుంబానికి దూరంగా ఉంటున్న హేమ మాలిని చేసిన కామెంట్స్ ఆసక్తిరేపాయి. హేమ మాలిని స్పందన అనంతరం ధర్మేంద్ర సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కల నెరవేరిందని షార్ట్ గా తన ఆనందం తెలియజేశాడు.

Written By:
  • Shiva
  • , Updated On : August 21, 2023 / 08:18 AM IST

    Hema Malini

    Follow us on

    Hema Malini: మరుగున పడిపోయిన హీరో సన్నీ డియోల్ గదర్ 2తో భారీ హిట్ కొట్టాడు. మూడు వందల కోట్లకు పైగా వసూళ్ళతో గదర్ 2 బాక్సాఫీస్ షేక్ చేస్తుంది. ఈ మూవీని ధర్మేంద్ర రెండో భార్య నటి హేమమాలిని చూశారు, అనంతరం సన్నీ డియోల్ పై ప్రశంసలు కురిపించారు. గదర్ 2 అద్భుతంగా ఉంది. సన్నీ డియోల్ చాలా బాగా నటించాడు. గదర్ 2 మూవీ ప్రతి ఒక్కరిలో దేశభక్తి పెంపొందిస్తుంది. 80ల నాటి కథ వలెనే ఉంది. దర్శకుడు అనిల్ శర్మ గొప్పగా తెరకెక్కించారని కామెంట్స్ చేశారు.

    ధర్మేంద్ర కుటుంబానికి దూరంగా ఉంటున్న హేమ మాలిని చేసిన కామెంట్స్ ఆసక్తిరేపాయి. హేమ మాలిని స్పందన అనంతరం ధర్మేంద్ర సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కల నెరవేరిందని షార్ట్ గా తన ఆనందం తెలియజేశాడు. ధర్మేంద్ర ఎవరిని ఉద్దేశించి ఈ కామెంట్ చేశారో చెప్పలేదు. అయితే హేమ మాలిని తన కొడుకు నటించిన గద్దర్ 2 మూవీ గురించి చేసిన కామెంట్స్ నేపథ్యంలో, ఆయన ఇలా పోస్ట్ పెట్టారనిపిస్తుంది. చాలా కాలంగా ధర్మేంద్ర కుటుంబానికి హేమ మాలిని దూరంగా ఉంటున్నారు.

    ఇటీవల హేమ మాలిని దీనిపై మాట్లాడారు. ఎవరూ భర్తకు దూరంగా ఉండాలని కోరుకోరు. కానీ విధిని మనం అంగీకరించాలి. లేదంటే జీవితాన్ని ఆస్వాదించలేము. ధర్మేంద్రకు దూరంగా ఉంటున్నందుకు నేను బాధపడటం లేదు. నాకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వాళ్ళను గొప్పగా పెంచాను. వివాహాలు చేశాను. ధర్మేంద్ర అక్కడ(మొదటి భార్య కుటుంబంతో) ఎక్కువగా ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు. ధర్మేంద్ర కుటుంబంలో జరిగిన వేడుకలకు కూడా హేమ మాలిని హాజరుకాకపోవడంతో ఇక ఆమె ధర్మేంద్ర కుటుంబాన్ని కలవరనే వాదనలు వినిపించాయి.

    తాజాగా హేమ మాలిని సన్నీ డియోల్ సినిమా గదర్ 2 బాగుందని చెప్పడం. పాజిటివ్ గా స్పందించడంతో కొత్త చర్చకు దారి తీసింది. శ్రీదేవి మరణం అనంతరం బోనీ కపూర్ ఫ్యామిలీ కలిసిపోయిన విషయం తెలిసిందే. శ్రీదేవి ఉన్నంత వరకు అర్జున్ కపూర్ కి బోనీ కపూర్ దూరంగా ఉన్నారు. ఇప్పుడు మొదటి భార్య పిల్లలతో కూడా సాన్నిహిత్యం కలిగి ఉన్నారు. ధర్మేంద్ర మొదటి వివాహంగా ప్రకాష్ కౌర్ ని పెళ్లి చేసుకున్నారు. సన్నీ, బాబీతో పాటు మరో ఇద్దరు సంతానం. 1980లో నటి హేమ మాలిని రెండో వివాహం చేసుకోగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు.