https://oktelugu.com/

Chandramukhi 2: కంగన ..జ్యోతిక లాగా మెప్పించనుందా.. అనుష్క లాగా నొప్పించనుందా..

చంద్రముఖి మొదటి పార్ట్ లో జ్యోతిక చంద్రముఖి ఆవహించిన పాత్రలో కనిపించగా, అసలు చంద్రముఖిని మనకు ఆ సినిమాలో చూపివ్వలేదు.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : August 21, 2023 / 08:28 AM IST

    Chandramukhi 2

    Follow us on

    Chandramukhi 2: 2005లో వచ్చిన చంద్రముఖి సినిమా తెలుగు, తమిళం లో భారీ విజయం సాధించింది. రజినీకాంత్, నయనతార జంటగా, చంద్రముఖి పాత్రలో జ్యోతికతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో హీరో రజనీకాంత్ అయినా కానీ అందరి దృష్టి జ్యోతిక వైపే మళ్ళింది. రజినీకాంత్ లాంటి సూపర్ స్టార్ కూడా ఆ సినిమాలో జ్యోతిక యాక్టింగ్ ముందర తక్కువే అనిపించాడు. చంద్రముఖిగా జ్యోతిక అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఒక రకంగా తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఈ సినిమా వచ్చిన 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు దీనికి సీక్వెల్ చంద్రముఖి 2 పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు డైరెక్టర్ పి.వాసు.

    అయితే మధ్యలో చంద్రముఖికి కంటిన్యూయేషన్ అంటూ మన తెలుగు లో నాగవల్లి అనే ఒక సినిమా తీశారు. వెంకటేష్ హీరోగా, అనుష్క, రిచా గంగోపాద్యాయ, కమలినీ ముఖర్జీ, శ్రద్దాదాస్ హీరోయిన్ లుగా పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ ‘నాగవల్లి’ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో అనుష్క కనిపించింది. ఇక చంద్రముఖి ఆవహించిన పాత్రలో రిచా గంగోపాధ్యాయ నటించింది.

    చంద్రముఖి మొదటి పార్ట్ లో జ్యోతిక చంద్రముఖి ఆవహించిన పాత్రలో కనిపించగా, అసలు చంద్రముఖిని మనకు ఆ సినిమాలో చూపివ్వలేదు. కానీ చంద్రముఖి అంతే జ్యోతికానే అన్నంత మెప్పించింది అ హీరోయిన్. కానీ రెండో పార్ట్ అయిన నాగవల్లి సినిమాలో ఏకంగా చంద్రముఖినే అనుష్క గా చూపించినా కానీ అనుష్క ఆ పాత్రకు అస్సలు సెట్ అవ్వలేదు. ప్రేక్షకులను చాలా నిరాశపరిచింది.

    ఇక నాగవల్లి సినిమాతో పెద్ద దెబ్బ తగలడంతో పి వాసు ఆ సినిమాని తమిళ ప్రేక్షకుల ముందుకు తీసుకుపోలేదు. అయితే ఇప్పుడు అసలు సిసలైన చంద్రముఖి రెండవ భాగం అంటూ చంద్రముఖి 2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ఈ డైరెక్టర్. ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటించగా కంగనా రనౌత్ రనాథ్ చంద్రముఖి పాత్రను చేస్తోంది. చంద్రముఖి పాత్ర అనేది అంత సులువు కాదు.

    కన్నడ, మలయాళం లో చంద్రముఖి పాత్రలలో శోభన సౌందర్య చాలా బాగా నటించారు. ఇక ముందుగా చెప్పుకున్నట్టు తమిళ, తెలుగులో జ్యోతిక ఇరగదీసింది. అయితే ఆ పాత్రలో హిందీలో చేసిన విద్యాబాలన్ కానీ, అలానే నాగవల్లి సినిమాలో చేసిన అనుష్క గాని మెప్పించలేకపోయారు. మరిప్పుడు తన యాక్టింగ్ కి ప్రత్యేక పేరు తెచ్చుకున్న కంగనా ఎలా చేస్తుంది అనేది అందరి సందేహం. ఈమధ్య రిలీజ్ అయిన టీజర్ లో కంగనా గెటప్ బాగానే ఉన్నా చంద్రముఖిగా తన నటన గురించి ఏమీ చూపివ్వలేదు.

    మరి కంగనా జ్యోతిక లాగా మెప్పిస్తుందా లేదా అనుష్కలాగా ప్రేక్షకులను నొప్పిస్తుందా అనే విషయం సినిమా విడుదలయితే కానీ తెలియదు.

    ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న గణేష్ చతుర్థికి విడుదల చేయడానికి మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీత బాణీలు సమకూర్చగా, సినిమాటోగ్రాఫర్ రవివర్మ అందిస్తున్నారు.రాఘవ లారెన్స్‌ కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఈ మువీలో వడివేలు, రాధికా శరత్‌కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, శ్రుతి డాంగే, సుభిక్ష కృష్ణన్, రవి మారియా, కార్తీక్ శ్రీనివాసన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.